షూటింగ్ లో ప్రమాదం, మంగ్లీకి గాయాలు, క్లారిటీ ఇచ్చిన ఫోక్ సింగర్

By Mahesh JujjuriFirst Published Jun 26, 2023, 1:33 PM IST
Highlights

షూటింగ్ సెట్ లో ఫోక్ సింగర్ మగ్లీకి గాయాలు అయ్యాయి. ఆమెను వెంటనే ఆస్పిటల్ కు తరలించగా.. ట్రీట్ మెంట్ చేసినట్టు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 

ప్రముఖ జానపద గాయని.. మంగ్లీకి షూటింగ్ లో గాయాలు అయ్యాయి.. తీవ్రమైన పెయిన్ తో బాధపడుతుండగా.. ఆమెను దగ్గరలో ఆస్పత్రికి తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ సాంగ్ షూటింగ్ లో పాల్గొన్న.. మంగ్లీ కాలికి గాయమైందని, తీవ్ర నొప్పితో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణలో ప్రస్తుతం  బోనాలు జరుగుతుండగా... ఓ సందర్భంగా ఓ ప్రైవేట్ సాంగ్ షూటింగ్...లో మంగ్లీ  పాల్గొనగా.. షూటింగ్ లో  మంగ్లీ కాలు జారి కింద పడ్డదని.. దీంతో ఆమె కాలికి గాయమైందని తెలుస్తోంది. అంతే కాదు.. మూవీ టీమ్ వెంటనే వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. డాక్టర్లు మంగ్లీని కొంత కాలం బయట తిరగకుండా  రెస్ట్ తీసుకోమని చెప్పిట్టు  తెలుస్తోంది.

అయితే మంగ్లీకి దెబ్బ తగలడం.. ట్రీట్మెంట్ తరువాత వెంటనే డిర్చర్జ్ చేయడం లాంటి వార్తలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.అయితే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మూవీ టీమ్ వెంటనే స్పందించినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఇది ఫేక్ న్యూస్ అంటూ.. దీని వైరల్ చేయవద్దు అని మంగ్లీ ప్రముఖ యూట్యూబ్ ఛనల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించినట్టు తెలుస్తోంది. 

Latest Videos

అయితే తనకు షూటింగ్ లో గాయమైందని వస్తున్న వార్తల్లో, నిజం లేదని, తానకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, తానుఫుల్ హ్యాపీగా ఉన్నట్టు  షూటింగ్ లో కూడా పాల్గొంటున్నానని అన్నారు. జానపద గాయనిగా స్టార్ డమ్ సాధించింది మంగ్లీ.  ప్రైవేట్ సాంగ్స్ తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.  యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. స్టార్ సింగర్ గా ఎదిగింది. సినిమాల్లో కూడా వరుస అవకాశాలు కొట్టేస్తూ.. కాస్తి డిఫరెంట్ గా ఉన్న పాటలు పాడుతూ.. దూసుకుపోతోంది. ఒక రకంగా కెరీర్ లో చాలా తక్కువ టైమ్ లో క్రేజ్ సాధించిన వారు  మంగ్లీ మాత్రమే. 

ఇకమంగ్లీ  ఇప్పటి వరకూ..దాదాపు వందకు పైగా సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.ఇంకా మంగ్లీ ప్రత్యేకత ఏంటంటే..?  ఆమె ప్రతీ పండుగకు  ప్రత్యేకత చాటేలా.. ఓ పాటను రాసి పాడి నటించి, డాన్స్ చేసి. మల్టీ టాలెంట్ చూపిస్తోంది. ఆ పండుగ ప్రత్యేకతను తెలియజేస్తూ ఒక ప్రైవేట్ పాట పాడి.. వీడియో సాంగ్ షూట్ చేయడం ఆమె ప్రతీ పెద్ద పండగకు చేస్తుంది. అవి లక్షల్లో వ్యూస్ సాధిస్తుంటాయి. 

click me!