తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్

Published : Nov 13, 2021, 09:03 AM IST
తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్

సారాంశం

సింగర్ మాళవిక పెళ్లి చేసుకున్నారు. బిజినెస్ మాన్ అశ్విన్ కశ్యప్ తో ఏడడుగులు ఆమె వేయగా, ఈ వివాహం ప్రత్యేకంగా మారింది. కారణం అశ్విన్ వయసులో మాళవిక కంటే చిన్నవాడు కావడమే.

వయసులో చిన్నవాడిని చేసుకోవడం గ్లామర్ ఇండస్ట్రీలో ట్రెండ్ గా మారింది. ప్రియాంకా చోప్రా (Priyanka chopra) తనకంటే ఏకంగా పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనాస్ వివాహం చేసుకున్నారు. అంతెందుకు సూపర్ స్టార్ మహేష్ (Mahesh babu) భార్య నమ్రత కంటే దాదాపు ఐదేళ్లు చిన్నవాడు. బాలీవుడ్ లో ఐటెం బాంబు మలైకా అరోరా వయసులో 15ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తుంది. తాజాగా లేడీ సింగర్ వయసులో తనకంటే చిన్నవాడిని వివాహం చేసుకుంది . 

సూపర్‌ సింగర్‌ ఫేమ్‌ మాళవిక సుందర్‌ (malavika sunder) ఎంటర్‌ప్రెన్యూర్‌ అశ్విన్‌ కశ్యప్‌ రఘురామన్‌ ని వివాహం చేసుకున్నారు. అశ్విన్ వయసులో మాళవిక కంటే చిన్నవాడు కావడం గమనార్హం. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. మూడు ముళ్లతో కొత్త జీవితం ప్రారంభించారు. 

Also read ట్రాన్స్ జెండర్ తో స్నేహం, ఆ విషయంలో ఎన్నో అవమానాలు... షాకింగ్ విషయాలపై ఓపెన్ అయిన చరణ్ వైఫ్ ఉపాసన
కాగా మాళవిక తమిళ సూపర్‌ సింగర్‌ షోలో ప్లే బ్యాక్‌ సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు.ఈ షో ద్వారా ఫేమ్ రాబట్టిన మాళవి తమిళంతో పాటు తెలుగులోనూ అనేక అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాళవిక ఇప్పటివరకు తెలుగులో 200 పైచిలుకు పాటలు పాడింది. తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోబోతున్నానని ఈ మధ్యే ఫ్యాన్స్‌కు హింటిచ్చిన గాయని.. పెళ్లికి వయసుతో పని లేదని, ఇద్దరం పరస్పరం అర్థం చేసుకుని, గౌరవించుకుంటే అంతే చాలని చెప్పుకొచ్చింది.

Also read పెళ్లి తర్వాత మీరు ఏం చేస్తారో... సినిమాలో నేను అదే చేశాను, రిపోర్టర్ కి హీరోయిన్ బోల్డ్ ఆన్సర్!

ఇక సింగర్ మాళవిక, అశ్విన్ పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. తమ అభిమాన సింగర్ పెళ్లి వార్త తెలుసుకున్న అభిమానులు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు