వివాదంలో దుల్కర్‌ “కురుప్”,కోర్టులో కేసు

By Surya PrakashFirst Published Nov 13, 2021, 8:53 AM IST
Highlights

కురుప్ సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దుల్కర్ సల్మాన్.. వన్ మ్యాన్ షోగా నడిచిన ఈ సినిమాలో.. పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వివిధ గెటప్స్ లో చక్కగా నటించి దుల్కర్ మెప్పించాడు. 

 ‘36 సంవత్సరాలు.. 300లకు పైగా టిప్‌ ఆఫ్స్‌.. వెయ్యికి పైగా ప్రయాణాలు.. ఇదంతా ఒక్కరి కోసం..  కురుప్‌.. సుకుమార కురుప్‌’ అంటూ  దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రలో వచ్చిన  చిత్రం ‘కురుప్‌’. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  బయోగ్రాఫికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నిన్న విడుదలైంది. విడుదలైన రోజే లీగల్ వివాదంలో చిక్కుకుంది . ఇందులో దుల్కర్‌ క్రిమినల్‌ పాత్రలో నటించారు. 

కేరళలోని కొచ్చికి చెందిన ఓ వ్యక్తి ‘కురుప్’ మూవీపై కోర్టులో పిల్ దాఖలు చేశారు. సుకుమార కురుప్ అనే నేరస్థుడి గోప్యతను వెల్లడించేలా ఈ మూవీని తెరకెక్కించాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనిపై కోర్టులో పిటీషన్‌ కూడా దాఖలు చేశాడు. అయితే కేరళ హైకోర్టు ‘కురుప్’ మూవీపై స్టే విధించడానికి మాత్రం నిరాకరించింది. అయితే ఈ మూవీ నిర్మాతలకు మాత్రం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పోల్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

Also read Kurup Movie review: దుల్కర్ సల్మాన్ 'కురుప్' మూవీ రివ్యూ

 ఇదిలా ఉంటే కురుప్ సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దుల్కర్ సల్మాన్.. వన్ మ్యాన్ షోగా నడిచిన ఈ సినిమాలో.. పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వివిధ గెటప్స్ లో చక్కగా నటించి దుల్కర్ మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని క్రైమ్ అండ్ సస్పెన్స్ సీక్వెన్స్ స్ లో మరియు తన డైలాగ్ డెలివరీతో దుల్కర్ చాలా బాగా నటించాడు. తన నటనతోనే కాకుండా తన లుక్స్ తో కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. ఈ సినిమా మొదటి రోజే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు శ్రీనాథ్ రాజేంద్రన్  దర్శకత్వం వహించారు. జితిన్ కె జోస్ కథను అందించగా.. డేనియల్ సయూజ్ నాయర్.. కెఎస్ అరవింద్ స్క్రీన్ ప్లే అందించారు. 
 

click me!