`ఆర్‌ఆర్‌ఆర్‌` దోస్తీ సాంగ్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. సింగర్‌ హేమచంద్ర

Published : Jul 29, 2021, 04:52 PM IST
`ఆర్‌ఆర్‌ఆర్‌` దోస్తీ సాంగ్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. సింగర్‌ హేమచంద్ర

సారాంశం

`ఆర్‌ఆర్‌ఆర్‌`లోని దోస్తీ సాంగ్‌ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఆయా భాషలకు చెందిన ఐదుగురు సింగర్స్ తో పాడించారు. తెలుగు వెర్షన్‌ పాడిన హేమచంద్ర ఈ సాంగ్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇండియాలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలోని తొలి సాంగ్‌ ఆగస్ట్ 1న విడుదల కానుంది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ సినిమాలోని ఫ్రెండ్‌షిప్‌పై వచ్చే ఈ పాటని విడుదల చేస్తున్నారు. వీడియోతో సహ ఈ పాటని రిలీజ్‌ చేయబోతున్నట్టు సమాచారం. దీంతో ఈ పాట ఎలా ఉంటుందని, ఎలా చిత్రీకరించారనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దానికి కోసం ఇండియా వైడ్‌గా సినీ ప్రియులు ఉత్కంఠభరితంగా వెయిట్‌ చేస్తున్నారు. ఈ పాటని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఆయా భాషలకు చెందిన ఐదుగురు సింగర్స్ తో పాడించారు.

ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్‌ పాడిన హేమచంద్ర ఈ సాంగ్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌లో పనిచేయడం ఇదే ఫస్ట్ టైమ్‌ అని, ఇదొక డ్రీమ్‌ అని, ఈ అవకాశం రావడం బ్లెస్సింగ్‌ అనాలో, ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. ఆ ఆనందాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదన్నారు. పాట పాడినప్పటినుంచి ఎగ్జైటింగ్‌గా ఉన్నట్టు చెప్పారు. అదే సమయంలో ఈ సాంగ్‌ షూట్‌ చేసిన విధానం నెక్ట్స్ లెవల్‌ అని తెలిపారు. 

ప్రతి పాటకి బాగా పాడతామా లేదా? అనే ఒత్తిడి ఉంటుంది. కానీ ఇది పాన్‌ ఇండియా సినిమా, పైగా రాజమౌళిగారిది. ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో నేను ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌ పాడటం నిజంగా గూస్‌బమ్స్ ఎక్స్ పీరియెన్స్ అని తెలిపారు. పాట చిత్రీకరించిన విధానం మైండ్‌ బ్లోయింగ్‌ అని, లిరిక్స్ అద్బుతంగా ఉన్నాయని, సిరివెన్నెల సీతారామశాస్త్రి బ్యూటీఫుల్‌ లిరిక్స్ రాశారని తెలిపారు. ఓవరాల్‌ ప్యాకేజీ సాంగ్‌ అని చెప్పారు. ఇదిలా ఉంటే ప్రభాస్‌, రానా, రవితేజ, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లపై ఈ పాటని చిత్రీకరించినట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

ఇక `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, ఎన్టీఆర్‌,రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా  నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌ 13న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి పదిభాషల్లో విడుదల చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?