నన్ను ముద్దు పెట్టుకున్న రాజ్ కుంద్రా, శిల్పా శెట్టితో విబేధాలు ఉన్నాయన్నాడు

Published : Jul 29, 2021, 01:39 PM IST
నన్ను ముద్దు పెట్టుకున్న రాజ్ కుంద్రా, శిల్పా శెట్టితో విబేధాలు ఉన్నాయన్నాడు

సారాంశం

రాజ్ కుంద్రా తన నివాసానికి రావడంతో పాటు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని షెర్లిన్ చోప్రా ముంబై పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలియజేశారు. సోమవారం పోలీసుల విచారణలో పాల్గొన్న షెర్లిన్ చోప్రా స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది.   

పోర్నోగ్రఫీ కేసులో ముద్దాయిగా మారిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పై శృంగార నటి షెర్లిన్ చోప్రా సీరియస్ ఆరోపణలు చేశారు. రాజ్ కుంద్రా తన నివాసానికి రావడంతో పాటు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ముంబై పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలియజేశారు. సోమవారం పోలీసుల విచారణలో పాల్గొన్న షెర్లిన్ చోప్రా స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. 

2019లో ఓ బిజినెస్ మీటింగ్ కోసం రాజ్ కుంద్రా నా మేనేజర్ కి ఫోన్ చేశారు. ఆ మీటింగ్ అనంతరం మార్చి 27వ తేదీన ఎటువంటి సమాచారం లేకుండా రాజ్ కుంద్రా నా ఇంటికి వచ్చారు. ఓ టెక్స్ట్ మెస్సేజ్ గురించి ఆర్గ్యుమెంట్ కోసం వచ్చినట్లు చెప్పారు. అదే సమయంలో, నన్ను ముద్దు పెట్టుకున్నాడు. నేను వద్దని వారిస్తున్నా బలవంతం చేయడానికి ప్రయత్నించాడు.. అని షెర్లిన్ చెప్పారు. 

ఆమె ఇంకా మాట్లాడుతూ, శిల్పా శెట్టితో తనకు విభేదాలు ఉన్నాయని, ఆమెతో తన రిలేషన్ సరిగా సాగడం లేదని, దాని వలన ఒత్తిడికి లోనవుతున్నట్లు నాతో చెప్పాడు. రాజ్ కుంద్రా ప్రవర్తనకు బయపడి నేను, వాష్ రూమ్ కి వెళ్లి లాక్ చేసుకున్నాను.. అని చెప్పారు. 2021 ఏప్రిల్ లో షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రాపై లైంగిక వేధింపుల కేసు పెట్టడం జరిగింది. రాజ్ కుంద్రా పై పలు సెక్షన్స్ క్రింద కేసు నమోదు కావడం జరిగింది. 

రాజ్ కుంద్రా అరెస్ట్ అనంతరం  షెర్లిన్ చోప్రా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. రాజ్ కుంద్రా చర్యలపై  మహారాష్ట్ర  సైబర్ సెల్ కి తాను మొదటగా ఇన్ఫార్మ్ చేసినట్లు వెల్లడించారు.   

PREV
click me!

Recommended Stories

100 కోట్లు వసూలు చేసినా అట్టర్ ఫ్లాప్ అయిన స్టార్ హీరోల సినిమాలు
నారి నారి నడుమ మురారి ఫస్ట్ రివ్యూ, శర్వానంద్ సినిమాకు సెన్సార్ చిక్కులు, సినిమా ఎలా ఉందంటే?