Mrunal Thakur : స్టార్ సింగర్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్? ఆ ఫొటోపై క్లారిటీ ఇచ్చిన బాద్షా

By Asianet News  |  First Published Nov 14, 2023, 4:21 PM IST

మృణాల్ ఠాకూర్ మరోసారి డేటింగ్ వార్తలతో మరోసారి షాక్ ఇచ్చింది. స్టార్ సింగర్ చేతిలో చేయిసుకొని వెళ్తున్న ఓ ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో సింగర్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. 
 


మరాఠి ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ‘సీతారామం’ సినిమాతో నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. తన బ్యూటీఫుల్ పెర్ఫామెన్స్ తో చిత్ర పరిశ్రమలోని దర్శకనిర్మాతలనూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ‘హాయ్ నాన్న’, ‘ ఫ్యామిలీ స్టార్’  చిత్రాల్లో నటిస్తోంది. మున్ముందు టాలీవుడ్ లోనే మరిన్ని చిత్రాలతో బిజీ కానుందని తెలుస్తోంది. ఇదిలా ఈ ముద్దుగుమ్మ ఇటీవల డేటింగ్ రూమర్లతో నెట్టింట సెన్సేషన్ గా మారుతోంది. 

ఇప్పటికే  ఈ ముద్దుగుమ్మ పెళ్లి వార్త నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారిన విషయం తెలిసిందే.  టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేసిన కామెంట్లే అందుకు ప్రధాన కారణం అయ్యాయి. మళ్లీ ఇప్పుడు ఆమె స్టార్ సింగర్ బాద్షా (Badshah)తో డేటింగ్ అంటూ పెద్ద ఎత్తున రూమర్లు వ్యాప్తి చెందాయి. ఇందుకూ ఓ కారణం ఉంది. తాజాగా వీరిద్దరూ చేతిలో చేయి పట్టుకొని తిరిగుతున్నట్టి, క్లోజ్ గా కనిపిస్తున్న ఓ ఫొటో నెట్టింటగా వైరల్ గా మారింది.  దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. 

Latest Videos

undefined

దీపావళి పండుగ సందర్బంగా బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి ఇంట్లో నిర్వహించిన కార్యక్రమానికి మృణాల్, బాద్షా కలిసి హాజరయ్యారు. ఇతర సెలబ్రెటీలు కూడా విచ్చేశారు. అయితే మృణాల్ - బాద్షా చేతులు పట్టుకొని వెళ్తున్న ఫొటో ఒకటి నెట్టింట చేరింది. దీంతో మృణాల్ ఆ స్టార్ సింగర్ ప్రేమలో పడిందనే సందేహాలు వినిపించాయి. అయితే దీనిపై తాజాగా సింగర్ బాద్షా స్పందించారు. 

 బాద్షా స్పందిస్తూ మొదట.. దీపావళి వేడుకలో దిగిన ఫొటోలను ఇన్ స్టా హ్యాండిల్ లో ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘నాకు అత్యంత ఇష్టమైన వారు’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఆ వెంటనే డేటింగ్ రూమర్లు రావడంతో మళ్లీ పోస్ట్ పెట్టారు. ‘డియర్ ఇంటర్నెంట్, నిరాశ పరుస్తున్నందుకు నన్ను క్షమించండి.’ అంటూ ఫన్నీ ఎమోజీతో క్లారిటీ ఇచ్చారు. దీంతో రూమర్లకు అడ్డుకట్ట పడింది. 

click me!