మనవళ్లతో రజినీకాంత్ దివాళి సెలబ్రేషన్స్, వైరల్ అవుతున్న ఫోటోస్..

By Mahesh JujjuriFirst Published Nov 14, 2023, 4:19 PM IST
Highlights

దీపావళిని సెలబ్రిలీలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నా. దివాళి తరువాత చిన్నగా కొన్ని పోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట దివాళి సెలబ్రేషన్స్ కు సబంధించి పోటోలు వైరల్ అవుతున్నాయి. 

సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ దీపావళిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అయితే సెలబ్రేటిటీకు సంబంధించిన దివాళికి సబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు చిన్నగా తమ సెలబ్రెషన్స్ కు సబంధించిన ఫోటోలు పంచుకుంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్  ఇంట జరిగిన దివాళి ఈవెంట్ కు సబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇద్దర కూతుళ్లు... మనవళ్ళు.. మనవరాళ్లు.. బంధు మిత్రులతో తలైవా.. దీపావళిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. 

 సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆయన కూతుళ్ళు తెలిసినంతగా..  మనవళ్లు చాలా మందికి తెలియదు..  బయట కూడా వారు పెద్దగా కనిపించరు. తాజాగా రజినీ తన మనవళ్లుతో కలిసి దివాళీ పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు. తాతయ్య పాదాలకు సాస్టాంగ నమస్కారం చేసి మరీ..  ఆయన అశీసులు తీసుకుంటున్న మనవళ్ల ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

అలాగే రజినీ కూతుళ్లు ఐశ్వర్యా, సౌందర్య, రజినీ భార్య లతా తో పాటు.. ఆయన తోడబుట్టిన వాళ్లు.. మరియు కుటుంబ సభ్యులు.. ఈ దివాళీ వేడుకలో కనిపించి సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక దివాళీ రోజు రజినీకాంత్ కి విషెస్ తెలియజేయడానికి వచ్చిన అభిమానులను కూడా సూపర్ స్టార్ పలకరించారు. ఇంటి గేటు ధాటి బయటకి వచ్చి ఫ్యాన్స్ ని దిల్ ఖుష్ చేశారు సూపర్ స్టార్. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by YouWe Media (@youwemedia)

ఇక రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం తలైవర్ 170 సినిమా చేస్తున్నారు. జైభీమ్ ఫేమ్ డైరెక్టర్ జ్జానవేల్ తెరకెక్కిస్తున్న ఈసినిమా  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  జై భీమ్‌ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దసరా విజయన్‌, రక్షన్ లు వంటి భారీ తారాగణం కనిపించబోతుంది. ఇటీవలే ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకొని చెన్నైలో జరిగే షెడ్యూల్ కోసం సిద్దమవుతుంది.

family Diwali celebration 🎆 pics.. pic.twitter.com/YO4zIr8jXl

— Ramesh Bala (@rameshlaus)

ఇక ఈసినిమాతో పాటు.. రజినీకాంత్ గారాల  కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో చేసిన లాల్ సలామ్ సినిమా కూడా రజినీ డాన్ పాత్రలో  నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. తాజాగా దివాళి కానుకగా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు టీమ్. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

click me!