#ProjectK:'ప్రాజెక్ట్-కె' పై సింగీతం ఏమంటారంటే...

Published : Sep 07, 2022, 01:55 PM IST
 #ProjectK:'ప్రాజెక్ట్-కె' పై సింగీతం ఏమంటారంటే...

సారాంశం

 ‘మహానటి’ (Mahanati) చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న నాగ్ అశ్విన్.. ఈ సినిమా కోసం బోలెడంత రీసెర్చ్ చేశాడట. ఈ సినిమా కోసం లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) ఇన్ పుట్స్ కూడా తీసుకున్నాడు. 


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas).. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) తొలి కలయికలో తెరకెక్కుతోన్న సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రాజెక్ట్ కె’ (Project K). వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్ లో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే (deepika Padukone) హీరోయిన్ గా నటిస్తుండగా.. బిగ్ బీ అమితాబ్ (Amitab) కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

 టైమ్ ట్రావెల్ కథాంశంతో ఆసక్తికరమైన కథాకథనాలతో ‘ప్రాజెక్ట్ కె’ అభిమానుల్ని అలరించబోతోంది. ‘మహానటి’ (Mahanati) చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న నాగ్ అశ్విన్.. ఈ సినిమా కోసం బోలెడంత రీసెర్చ్ చేశాడట. ఈ సినిమా కోసం లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) ఇన్ పుట్స్ కూడా తీసుకున్నాడు. అయితే ఆయన ఎంతవరకూ సాయం చేసారనే విషయమై ఆయనే స్వయంగా రీసెంట్ గా ఓ ఇంటర్వూలో చెప్పారు.

లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమంలో సినీ విశేషాలు, తన అద్భుత ఆవిష్కరణల తీరుతెన్నులను పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు కే ప్రస్దావన వచ్చింది.  ఈ సందర్బంగా మాట్లాడుతూ...

"ప్రాజెక్టు-కె షూటింగ్ లో నేను లేను. ఆ సినిమాతో నాకున్న అనుబంధం చాలా చిన్నది. నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేశాడు. మార్పుచేర్పులు చేయమని నన్ను కోరాడు. అలా ప్రాజెక్టు-కె స్క్రిప్ట్ లో కొన్ని మార్పుచేర్పులు చేశానంతే. అక్కడితో నా పని అయిపోయింది." ఇలా ప్రాజెక్టు-కె సినిమాలో తన పాత్ర, పరిధిని బయటపెట్టారు సింగీతం.  

‘ప్రాజెక్ట్ కె’ చిత్రం కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ అత్యున్నత సాంకేతికతను వాడుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు రూ. 400కోట్లు బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాతో ప్రేక్షకుల్ని ఊహాలోకంలోకి తీసుకెళ్ళబోతున్నాడు దర్శకుడు. అందుకే ఈ సినిమాకోసం కొత్త రకం టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు సమాచారం. చిత్రీకరణకు ‘అలెక్సా 65’ (Alexa 65) అనే హై క్వాలిటీ కెమేరాను వాడుతున్నారు. ‘అవెంజర్స్ (Avengers) , గాడ్జిల్లా (Godzilla), కింగ్‌కాంగ్ (Kingkong)’ లాంటి అద్భుత చిత్రాలకు ఈ కెమేరానే వాడారు. దీని విలువ సుమారు రూ. 8కోట్ల పైమాటే. హై ఎండ్ మోషన్ పిక్చర్స్ ను కేప్చర్ చేసే సత్తా ఈ కెమేరాకుంది. అయితే ఈ కెమేరాను అన్ని సన్నివేశాలకూ వాడరు. కేవలం షాట్స్ కు మాత్రమే ఉపయోగిస్తారు. ఈ కెమేరాను కొనుగోలు చేసి వాడుతున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్ కె’ ప్రత్యేకతను చాటుకుంటోంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు