
అల్లు అర్జున్ అభిమానుల దృష్టి మొత్తం పుష్ప రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" పై ఉందన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే సుకుమార్ ఈ సినిమా స్క్రిప్టు పూర్తి చేసారు. కొత్త క్యారక్టర్స్, కొత్త టిస్ట్ లతో సెకండ్ పార్ట్ ...మొదటిదాన్ని మించిపోయేలా ఉంటుందని తెలుస్తోంది. పుష్ప 2' సినిమా మరో రెండు రోజుల్లో సెట్ పైకి వెళుతున్నట్టుగా రష్మిక చెప్పింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఆనందాన్ని కలిగించే విషయమే. 'పుష్ప 2' సెట్స్ పైకి వెళ్లే సమయం దగ్గరికి వచ్చేసిందన్న మాట. అయితే అదే సమయంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఎప్పుడు అనేది ఆసక్తికరంగా ఎదురూచేసే విషయం.
అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని దసరాకు రిలీజ్ చెయ్యాలని టీమ్ భావిస్తోంది.అయితే ఫస్ట్ లుక్ లో కంటెంట్ చాలా కొత్తగా ఉండాలని , వైరల్ అవ్వాలని ఫస్ట్ పార్ట్ ని మైమరిపించాలనేది వారి ఆలోచనగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు బడ్జెట్ బాగా పెరిగింది. దాంతో బజ్ ని మరింతగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది.
అంతేకాదు మారుతున్న బాక్సాఫీస్ సమీకరణాల నేపథ్యంలో దర్శకుడు సుకుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మేకర్స్, హీరో అల్లు అర్జున్.. అన్ని ఈక్వేషన్స్‌నీ పరిగణనలోకి తీసుకుని ‘పుష్ప ది రూల్’ తెరకెక్కించాల్సి వుంది. మరో ప్రక్క హిందీ మార్కెట్ మాత్రమే కాదు, తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల్ని సైతం ‘పుష్ప ది రూల్’ టార్గెట్ చేయాల్సి వుంది. ‘పుష్ప’ సినిమాకి హీరోయిన్ రష్మిక మండన్న అదనపు అడ్వాంటేజ్. ఆమె కూడా ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది.
ఇక 'పుష్ప' 350 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఒక్క హిందీలోనే ఈ సినిమా 100 కోట్లకి పైగా కొల్లగొట్టింది. దాంతో ఈ సారి పాన్ ఇండియా స్థాయిలోనే 'పుష్ప 2' సినిమాను నిర్మిస్తున్నారు. ఇతర భాషల నుంచి మరికొంతమంది స్టార్స్ ను తీసుకుంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.