ఆర్ ఆర్ ఆర్ రికార్డు బ్రేక్ చేసిన బ్రహ్మాస్త్ర!

Published : Sep 07, 2022, 01:54 PM IST
ఆర్ ఆర్ ఆర్ రికార్డు బ్రేక్ చేసిన బ్రహ్మాస్త్ర!

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డు ఓ విభాగంలో బ్రహ్మాస్త్ర బ్రేక్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో రన్బీర్ కపూర్ మూవీ జోరు చూపించింది.   


బ్రహ్మాస్త్రం చిత్ర విజయం చిత్ర యూనిట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హిందీతో పాటు ఇతర భాషల్లో మూవీని విజయవంతం చేయాలని భారీగా ప్రమోట్ చేస్తున్నారు. రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన బ్రహ్మస్త్ర సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. రన్బీర్ కపూర్-అలియా భట్ జంటగా నటించారు. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, నాగార్జున కీలక రోల్స్ చేస్తున్నారు. తెలుగులో బ్రహ్మాస్త్రం చిత్రాన్ని రాజమౌళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీరియస్ గా ప్రమోట్ చేస్తున్నారు. 

బాలీవుడ్ లో భారీ చిత్రాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో మేకర్స్ లో ఆందోళన నెలకొంది. అయితే వాళ్ళ ఆందోళనకు ఉపశమనం కలిగించేలా అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా హిందీ వర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తుంది. సెప్టెంబర్ 6 ఉదయం 11:30 సమయానికి మేజర్ థియేటర్ చైన్స్ ఐనాక్స్, సినీప్లెక్స్, పివిఆర్ లలో 1.31 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది ఆర్ ఆర్ ఆర్, భూల్ బులయా 2 అడ్వాన్స్ బుకింగ్స్ కంటే ఎక్కువ. ఆ విధంగా ఆర్ ఆర్ ఆర్ రికార్డు బ్రహ్మాస్త్ర అధిగమించింది. 

అయితే కెజిఎఫ్ చాప్టర్ 2 కంటే చాలా వెనుక ఉంది. కెజిఎఫ్ 2 హిందీ ఏకంగా 5.05 లక్షల టికెట్స్ తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. బ్రహ్మాస్త్ర చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. సోషియా ఫాంటసీ నేపథ్యంలో విజువల్ వండర్ గా రూపొందించారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో బ్రహ్మస్త్ర సత్తా చాటుతుండగా... మరోవైపు బాయ్ కాట్ సెగలు భయపెడుతున్నాయి. ప్రతి రోజూ బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర అనే నెగిటివ్ హ్యాష్ ట్యాగ్ నెటిజెన్స్ ట్రెండ్ చేస్తున్నారు. నిర్మాత కరణ్ జోహార్ తో పాటు అలియా భట్, రన్బీర్ పై ఉన్న కోపాన్ని ఇలా ప్రదర్శిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు