నెగటివ్ పాత్రతో వస్తున్న నాటి స్టార్ హిరోయిన్ సిమ్రన్

Published : Jan 08, 2018, 07:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
నెగటివ్ పాత్రతో వస్తున్న నాటి స్టార్ హిరోయిన్ సిమ్రన్

సారాంశం

నైంటీస్ లో టాప్ హిరోయిన్ గా వెలుగొందిన సిమ్రన్ నెగటివ్ పాత్రతో తిరిగొస్తున్న నాటి స్టార్ హిరోయిన్ సిమ్రన్ శివకార్తికేయన్ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న సిమ్రన్  

నైంటీస్ నుండి దశాబ్దానికి పైగా దక్షిణాది భాషల సినిమా హిరోయిన్ గా  స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకుంది సిమ్రన్. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒక వెలుగు వెలిగింది. తన హయంలో సౌత్ లో నంబర్ వన్ అనిపించుకున్న హీరోయిన్ సిమ్రన్. అవకాశాలు మందగించాకా.. ఈమె పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న సిమ్రన్.. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ నటిగా కెరీర్ ను కొనసాగించింది.



‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’లో నటించింది. బాలయ్యతో ‘ఒక్క మగాడు’లో కూడా నటించింది. ఆపై అడపాదడపా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటోంది సిమ్రన్. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు లేడీ విలన్ గా అవతారం ఎత్తుతోందట ఈమె. ఈ విషయాన్ని సిమ్రన్ స్వయంగా ప్రకటించింది.



తమిళ యువహీరో శివకార్తికేయన్ సినిమాలో తనది నెగిటివ్ రోల్ అని, లేడీ విలన్ గా కనిపించబోతున్నాను అని ఆమె ప్రకటించింది. ఇక విక్రమ్ హీరోగా నటించిన ‘ధ్రవనక్షత్రం’లో కూడా సిమ్రన్ ఒక ముఖ్య పాత్ర చేసిందట. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?