రష్మిక డాన్స్ కు ఫిదా అయ్యారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. సికిందర్ సినిమాలో జంటగా నటిస్తున్నారు ఇద్దరు తారలు. ఈక్రమంలో ఈమూవీ నుంచి టైటిల్ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు.
సికిందర్ సినిమా టైటిల్ ట్రాక్ టీజర్ విడుదలైంది! సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సినిమా మార్చి 28న రంజాన్ పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. ఏ.ఆర్. మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న మొదటి సినిమా ఇది. ఇందులో పుష్ప, యానిమల్ సినిమాల ఫేమ్ రాష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. సల్మాన్ ఖాన్, రాష్మిక జోడీని తెరపై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'సికిందర్' సినిమాలో ఇప్పటి వరకు వచ్చిన పాటల్లో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భతంగా ఉంది అని ప్రశంసలు కురుస్తున్నాయి. 'జోరా జబిన్', 'బమ్ బమ్ భోలే' పాటలు ఇప్పటికే విడుదలై హిట్ అవ్వగా, ఇప్పుడు 'సికిందర్ నాచే' అనే టైటిల్ ట్రాక్ పాట టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ఇద్దరి డాన్స్ అదరిపోయింది. సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా పేజీలో 'సికిందర్' సినిమా టైటిల్ ట్రాక్ పాట టీజర్‌ను విడుదల చేశారు.
23 సెకన్లు ఉన్న ఈ వీడియోలో సల్మాన్ ఖాన్ మాస్‌గా ఉన్నారు. రాష్మిక అందంగా డాన్స్ చేసింది. ఈ టీజర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సల్మాన్ లుక్ 'టైగర్' సినిమాలో ఉన్నట్లు ఉందని అభిమానులు పోలుస్తున్నారు. సల్మాన్ నలుపు రంగు డ్రెస్‌లో ఒక పార్టీకి వస్తున్నట్లు ఉన్నాడు. ఇది 'ఏక్ థా టైగర్' (2012) సినిమాలో వచ్చినట్లు ఉంది. రాష్మిక తెలుపు రంగులో దేవతలా కనిపించింది.
Song out tomorrowhttps://t.co/NXBxs5M4SC ’s
Directed by … pic.twitter.com/r3ZoRMoZM9
— Salman Khan (@BeingSalmanKhan)
ఈ టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ పాట టీజర్‌ను చూసిన చాలామంది సల్మాన్, కత్రినా నటించిన 'ఏక్ థా టైగర్' సినిమాలో వచ్చిన 'మాషా అల్లా' పాటలా ఉందని కామెంట్ చేస్తున్నారు. కొందరేమో ఇది బీస్ట్ సినిమాలో వచ్చే అరబిక్ కుత్తు పాటను గుర్తు చేస్తోందని అంటున్నారు. సికిందర్ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది.