Aparna Balamurali: 'ఆకాశం నీ హద్దురా' హీరోయిన్ ఆరోగ్యంపై వదంతులు.. ఒక్కసారిగా అందరికి మైండ్ బ్లాక్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 24, 2021, 03:40 PM IST
Aparna Balamurali: 'ఆకాశం నీ హద్దురా' హీరోయిన్ ఆరోగ్యంపై వదంతులు.. ఒక్కసారిగా అందరికి మైండ్ బ్లాక్

సారాంశం

హీరో సూర్య కమర్షియల్ చిత్రాలు చేస్తూనే 'ఆకాశం నీ హద్దురా', 'జై భీం' లాంటి అవార్డు విన్నింగ్ చిత్రాలు చేస్తున్నాడు. 'ఆకాశం నీ హద్దురా' చిత్రం ఓటిటిలో విడుదలైన ఘనవిజయం సొంతం చేసుకుంది.

హీరో సూర్య కమర్షియల్ చిత్రాలు చేస్తూనే 'ఆకాశం నీ హద్దురా', 'జై భీం' లాంటి అవార్డు విన్నింగ్ చిత్రాలు చేస్తున్నాడు. 'ఆకాశం నీ హద్దురా' చిత్రం ఓటిటిలో విడుదలైన ఘనవిజయం సొంతం చేసుకుంది. IMDB లో అత్యధిక రేటింగ్ సాధించిన చిత్రాల్లో ఇది కూడా ఒకటిగా రికార్డు సృష్టించింది. అలాగే ఇటీవల ఓటిటి వేదికగానే విడుదలైన జై భీం చిత్రానికి కూడా అద్భుతమైన స్పందన లభించింది. 

ఇదిలా ఉండగా ఆకాశం నీ హద్దురా చిత్రంలో యువ నటి అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. సూర్య పక్కన సహజసిద్ధమైన నటనతో అదరగొట్టింది. గడసరి అమ్మాయిగా ఆమె నటనకు అంతా ఫిదాఅయ్యారు. సూర్యతో కెమిస్ట్రీ బాగా పండించింది ఈ బ్యూటీ. ఆకాశం నీ హద్దురా చిత్రం అపర్ణకు అద్భుతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. 

తాజాగా ఆమె ఆరోగ్యం గురించి అంతా షాక్ అయ్యే వదంతులు మొదలయ్యాయి. అపర్ణ బాలమురళి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిందని,ప్రస్తుతం ఆమె కండిషన్ సీరియస్ గా ఉందంటూ కేరళ, తమిళనాడులో రూమర్స్ వ్యాపించాయి. ఈ వదంతులతో ఆమె స్నేహితులు, అభిమానులు, కొందరు కుటుంబ సభ్యులు సైతం కంగుతిన్నారు. ఈ వార్తలు విన్న అపర్ణ సన్నిహితులకు కాసేపు మైండ్ బ్లాక్ అయింది. 

కానీ అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. అందులో ఎలాంటి వాస్తవం లేదు. దీనిపై స్వయంగా అపర్ణ బాలమురళి క్లారిటీ ఇచ్చింది. నేను బాగానే ఉన్నాను. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. దయచేసి ఎవరూ రూమర్స్ నమ్మకండి. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరూ కంగారు పడవద్దు అని అపర్ణ తెలిపింది. 

Also Read: Poonam Bajwa: 'బాస్' బ్యూటీ అందాల రచ్చ.. నెటిజన్ చిలిపి ప్రశ్నకు అదిరిపోయే రిప్లై

PREV
click me!

Recommended Stories

Bayilone Ballipalike : దుమ్ములేపుతున్న మంగ్లీ ఫోక్ సాంగ్, 10 రోజుల్లోనే ఎన్ని కోట్ల వ్యూస్ రాబట్టిందంటే?
Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని