బొమ్మరిల్లు భాస్కర్ తో.. సిద్దు జొన్నలగడ్డ సినిమా.. సైలెంట్ గా మూవీ ఓపెనింగ్

Published : Aug 10, 2023, 01:19 PM IST
బొమ్మరిల్లు భాస్కర్ తో.. సిద్దు జొన్నలగడ్డ  సినిమా.. సైలెంట్ గా మూవీ ఓపెనింగ్

సారాంశం

అనుకున్నదే జరిగింది. అనుమానిస్తున్నట్టు అయ్యింది. బొమ్మరిల్లు భాస్కకర్ తో చెయి కలిపాడు.. యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ.. ఎలాంటి ప్రకటన లేకుండా కామ్ గా సినిమా ఓపెనింగ్ కూడా చేసేశారు. 

అనుకున్నంతా అయ్యింది. సిద్దు జొన్నలగడ్డ.. తనకు ఆరేంజ్ సినిమాతో అవకాశం ఇచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేయబోతున్నాడు అన్న ప్రచారం జరగ్గా.. అదే నిజం అయ్యింది. అంతే కాదు ఈ 10వ తారీకున ఎలాంటి ప్రకటన లేకుండా సినిమా ఓపెనింగ్ అంటూ కూడా సోషల్ మీడియా గట్టిగా చెప్పింది. అది కూడా నిజం అయ్యింది. తాజాగా భాస్కర్ డైరెక్షన్ లో సిద్దు సినిమా ఓపెనింగ్ అట్టహాసంగా జరిగింది. రీంసెంట్ గా  అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తీసి మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన భాస్కర్ ఇప్పుడు సిద్దుతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్  చేస్తున్నాడు కాని అఫీషియల్ గా ప్రకటించకుండానే... నేడు(10 అగస్ట్)  ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చి..  సినిమా ఓపెనింగ్ చేశారు. 

ఇక ప్రేమ కథలు అద్భుతంగా తెరకెక్కిస్తాడు బొమ్మరిల్లు భాస్కర్. అటువంటిది.. ఆ ప్రేమ కథకు  సిద్దు లాంటి ఎనర్జీ తోడైతే.. సిల్వర్ స్క్రీన్ పై బ్లాస్టింగ్ మ్యాజిక్ ఖాయం అంటున్నారు సినీ జనాలు.  మరి రొమాంటిక్ బాయ్ సిద్ధుని భాస్కర్ ఎలా చూపిస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు.  ఇక ఈ సినిమాని SVCC పతాకంపై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవర్ని తీసుకుంటారా అనేది ఆసక్తి కరంగా మారింది. 

టాలీవీవుడ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా... కెరీర్‌ స్టార్ట్‌ చేశాడు సిద్దూ జొన్నలగడ్డ. జోష్ సినిమాతో పాటు..  ఆరెంజ్‌ సినిమాలో  కనిపించి జనాలకు కాస్త రిజిస్టర్ అయ్యాడు సిద్దు.  ఆతరువాత తనకు ఏ సినిమా కలిసి రాలేదు. దాంతో తానే రైటర్ గా మారి.. ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో .. గుంటూరు టాకీస్‌ సినిమా చేశాడు. ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు.. సిద్దుకు రొమాంటిక్ హీరో ఇమేజ్ ను కూడా తీసుకువచ్చింది. ఈసినిమా తరువాత సిద్దుకు లాక్‌ డౌన్‌ టైమ్‌లో వచ్చిన కృష్ణ అండ్‌ ఈజ్‌ లీలా మాత్రం కాస్త క్రేజ్‌ తెచ్చిపెట్టింది.

ఈ సినిమాకు కూడా రైటర్‌ ఆయనే. ఈ సినిమా తర్వాత జనాలకు సిద్దూ పేరు బాగానే రిజస్టర్‌ అయింది. ఆ తర్వాత వచ్చిన మా వింత గాధ వినుమా కూడా ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక సిద్దరు కెరీర్ ను భారీ టర్న్ తిప్పిన సినిమా మాత్రం  డీజే టిల్లు నే. ఈసినిమా సిద్దూకు మంచి బ్రేక్‌ ఇచ్చింది. పద్నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న రాని గుర్తింపు డీజే టిల్లు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో సిద్దు జొన్నల గడ్డకు యూత్ లో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆసినిమాకు సీక్వెన్ ను చేస్తూ.. అంతకు మించిన క్రేజ్ కోసం చూస్తున్నాడు సిద్దు. ఈసీక్వెల్ తరువాత సిద్దు ఏం సినిమా చేస్తాడా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతలోనే భాస్కర్ తో సినిమా ఓపెనింగ్ కూడా చేసేశాడు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..