సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) పుట్టిన రోజు గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఆయనకు విషెష్ తెలిపిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సాహసాల వీరుడు సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా, ఆయన నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహేశ్ బాబుకు పుట్టిన రోజు వేడుకులు నిన్న గ్రాండ్ గా జరిగాయి. 1975 ఆగస్టు 9న బాబు చెన్నైలో జన్మించారు. నిన్నటితో మహేశ్ బాబు 47వ ఏట అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు శుభాకాంక్షల వెల్లువ కురిపించారు. రకరకాలుగా ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన హిట్ చిత్రాల్లో ఒకటైన ‘బిజినెస్ మెన్’ చిత్రాన్ని 4కే వెర్షన్ లో నిన్న రీరిలీజ్ కూడా చేశారు. థియేటర్లలో అభిమానులు సందడి చేస్తోంది. రీరిలీజ్ ల ట్రెండ్ లో ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసిందని కూడా తెలుస్తోంది. అభిమానులు ఇలా బాబు సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించారు. భారీ కటౌట్లు కట్టి, కేక్ కట్ చేసి, టపాసులు పేల్చి సందడి చేశారు.
ఇక తనపై చూపిస్తున్న ప్రేమకు మహేశ్ బాబు తాజాగా థ్యాంక్యూ నోట్ ద్వారా స్పందించారు. ‘డియర్ ఫ్యాన్స్, వెల్ విషర్స్. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు వినయపూర్వకంగా స్వీకరిస్తున్నాను. నా పుట్టిన రోజును మరింత గుర్తుండిపోయేలా చేసిన మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు కురిపించిన ప్రేమకు కృతజ్క్షతుడిని.. ప్రేమతో మీ మహేశ్ బాబు’. అని పేర్కొన్నారు.
మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ‘బిజినెస్ మెన్’ రీరిలీజ్ తోపాటు ‘గుంటూరు కారం’ నుంచి కూడా మాస్ పోస్టర్లను వదిలారు. మాస్ అవతార్ లో బాబు ఫిదా చేశారు. ప్రస్తుతం పోస్టర్లకు మాసీవ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి, శ్రీలీలా కథనాయికలు. హారిక అండ్ హాసిని మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.