పవన్ పుట్టిన రోజున 'ఓజి' మాస్ ట్రీట్.. మైండ్ బ్లోయింగ్ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చిన టీమ్

Published : Aug 10, 2023, 01:11 PM IST
పవన్ పుట్టిన రోజున 'ఓజి' మాస్ ట్రీట్.. మైండ్ బ్లోయింగ్ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చిన టీమ్

సారాంశం

ఓజి చిత్రం గురించి ప్రతి చిన్న విషయం కూడా హైప్ పెంచే విధంగా ఉంది. డైరెక్టర్ సుజీత్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఓజి చిత్రం గురించి ప్రతి చిన్న విషయం కూడా హైప్ పెంచే విధంగా ఉంది. డైరెక్టర్ సుజీత్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ డాన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయ రెడ్డి లాంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ కి జోడిగా ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఇదిలా ఉండగా త్వరలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే అనే సంగతి తెలిసిందే. పవన్ బర్త్ డే రోజున ఓజి టీం మాసివ్ ట్రీట్ ప్లాన్ చేశారు. ఆ ట్రీట్ ఏంటనేది చెప్పకుండా సస్పెన్స్ లోకి నెడుతూ మైండ్ బ్లోయింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

అయితే అందుతున్న సమాచారం మేరకు ఆరోజున చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయి. ముంబై చర్చి గేటు దగ్గర పవన్ కళ్యాణ్ తన గ్యాంగ్ తో వచ్చి విధ్వసం సృష్టించి వెళ్ళిపోతున్నాడు. 

పవన్ కళ్యాణ్ బ్లాక్ డ్రెస్ లో వెనుక నుంచి ఉన్న స్టిల్ అద్భుతంగా ఉంది. ఈ పోస్టర్ పై.. లొకేషన్ - చర్చి గేటు సౌత్ బాంబే, టైం- తెల్లవారు జామున 2.18, రైన్ డెన్సిటీ -25 మిల్లీమీటర్ల, రక్త ప్రవాహం డెన్సిటీ -32 మిల్లి మీటర్లు, ఉపయోగించిన ఆయుధం - డబుల్ బారెల్ షాట్ గన్ అని పోస్టర్ పై రాసి ఉంది. 

పవన్ ఫ్యాన్స్ అంతా పోస్టర్ లో ఉన్న విశేషాలు గురించి, పవన్ స్టైల్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2 పవన్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..