Shyam Singha Roy: శ్యామ్ సింగ రాయ్ సెన్సార్ రివ్యూ.. కొత్త అనుభూతి, గూస్ బంప్స్ గ్యారెంటీ

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 19, 2021, 02:57 PM IST
Shyam Singha Roy: శ్యామ్ సింగ రాయ్ సెన్సార్ రివ్యూ.. కొత్త అనుభూతి, గూస్ బంప్స్ గ్యారెంటీ

సారాంశం

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ' Shyam Singha Roy  ' డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో మడోనా కీలక పాత్రలో నటించింది. నానికి జోడిగా ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి నటించారు.

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ' Shyam Singha Roy  ' డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో మడోనా కీలక పాత్రలో నటించింది. నానికి జోడిగా ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి నటించారు. మడోనా కూడా కథలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. రాహుల్ సంస్కృత్యాన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ యువ దర్శకుడు టాక్సీ వాలా చిత్రంతో గుర్తింపు పొందాడు. 

కొద్ది సేపటి క్రితమే సెన్సార్ సభ్యులు 'శ్యామ్ సింగ రాయ్' చిత్రానికి యు ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. దీనితో శ్యామ్ సింగ రాయ్ చిత్ర రిలీజ్ కు అంతా సిద్దమైనట్లు అయింది. ఈ చిత్రం చూసి సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ని అభినందించినట్లు సమాచారం. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తో పాటు కొత్త అనుభూతి కలిగించే చిత్రం ఇది అని ప్రశంసించారట. 

ఈ చిత్రంలో నాని రెండు విభిన్నమైన పాత్రలో రెండు డిఫెరెంట్ టైం పీరియడ్స్ లో కనిపిస్తాడు. ఒక పాత్రలో మోడ్రన్ యువకుడిగా కనిపించగా.. మరో పాత్రలో శ్యామ్ సింగ రాయ్ గా కనిపిస్తాడు. మోడ్రన్ యువకుడిగా ఉన్న నానికి జోడిగా కృతి శెట్టి.. శ్యామ్ సింగ రాయ్ కి జోడిగా సాయి పల్లవి నటించింది. 

నాని, కృతి శెట్టి మధ్య రొమాన్స్ యువతని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇక శ్యామ్, సాయి పల్లవి మధ్య ప్రేమ సన్నివేశాలు క్లాస్ ఆడియన్స్ ని మెప్పించేలా ఉంటాయి. సరికొత్త కథాంశంతో దర్శకుడు రాహుల్ సర్ ప్రైజ్ చేసినట్లు తెలుస్తోంది. శ్యామ్ సింగ రాయ్ పోరాట సన్నివేశాలు, డైలాగులు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయట. ఈ తరహా చిత్రంలో తెలుగులో తెరకెక్కినందుకు గర్వంగా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్లు తెలుస్తోంది. 

వి, టాక్ జగదీశ్ చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కాలేదు. పైగా నిరాశపరిచాయి. దీనితో నాని ప్రస్తుతం విజయ దాహంతో ఉన్నాడు. శ్యామ్ సింగ రాయ్ నాని కెరీర్ లో మెమొరబుల్ మూవీగా నిలిచిపోతుందనే టాక్ వినిపిస్తోంది. నాని శ్యామ్ సింగ రాయ్ విశ్వరూపంతో డిసెంబర్ 24న థియేటర్స్ లో ప్రత్యక్షం కాబోతున్నాడు. 

Also Read: Shyam Singha Roy: మలయాళీ పిల్ల మ్యాజిక్ అందాలు.. జస్ట్ అమేజింగ్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nandamuri Balakrishna: గత 25 ఏళ్లలో బాలకృష్ణ బిగ్గెస్ట్ హిట్ ఏదో తెలుసా.. 32 సినిమాలు చేస్తే 10 హిట్లు
Naga Chaitanya: నా భర్తను అలా పిలవొద్దు.. శోభిత కి కోపం వచ్చేసిందిగా..!