మెగాస్టార్ కూతురికి కష్టాలా...?

Published : Jan 21, 2019, 10:58 AM IST
మెగాస్టార్ కూతురికి కష్టాలా...?

సారాంశం

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గారాలపట్టి శ్వేతా నంద తన జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మెగాస్టార్ కూతురు కదా తనకేం కష్టాలు ఉంటాయని అనుకునేవారికి తాను ఎదురుకొన్న ఇబ్బందుల గురించి వివరించింది.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గారాలపట్టి శ్వేతా నంద తన జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మెగాస్టార్ కూతురు కదా తనకేం కష్టాలు ఉంటాయని అనుకునేవారికి తాను ఎదురుకొన్న ఇబ్బందుల గురించి వివరించింది.

2006లో శ్వేతా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన సమయంలో అవకాశాలు రాక ఎన్నో ఇబ్బందులను ఎదురుకొన్నారట. తాను పడ్డ కష్టాలు తన కూతురు పడకూడదని ఆమెని సినిమాలకు దూరంగా పెంచుతున్నానని వెల్లడించింది.

కరణ్ జోహార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న 'కాఫీ విత్ కరణ్' షోకి శ్వేతా తన సోదరుడు అభిషేక్ బచ్చన్ తో కలిసి వచ్చింది. ఈ నేపధ్యంలో శ్వేతా కుమార్తె నవేలీ సినీ పరిచయం గురించి ప్రస్తావించగా.. తన కూతురు సినిమాల్లోకి రాదని క్లారిటీ ఇచ్చింది శ్వేతా.

సినిమా ఆడకపోయినా, అవకాశాలు రాకపోయినా నటీనటులు ఎంతో బాధ పడుతుంటారని, వారి ముఖాల్లో అది స్పష్టంగా కనిపిస్తుందని అలాంటి బాధ తన కూతురికి వద్దని తెలిపింది. ఇన్స్టాగ్రామ్ లో అభిషేక్ బచ్చన్ నటుడిగా ఫెయిల్ అయ్యాడంటూ చేసే కామెంట్స్ ఎలా ఉంటాయో తనకు తెలుసునని, ఈ విషయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లు తెలిపింది. తనలాగా తన కుటుంబంలో మరో వ్యక్తి బాధ పడకూడదని వెల్లడించింది.  

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?