సుకుమార్ ని నమ్మి మోసపోడు కదా..?

Published : Jan 21, 2019, 10:06 AM IST
సుకుమార్ ని నమ్మి మోసపోడు కదా..?

సారాంశం

టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ తో పని చేయడానికి హీరోలు ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం అతడు స్టార్ హీరోలకు మాత్రమే పరిమితం కావడంతో మీడియం రేంజ్ హీరోలకు ఇప్పట్లో అవకాశాలు లేవనే చెప్పాలి. 

టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ తో పని చేయడానికి హీరోలు ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం అతడు స్టార్ హీరోలకు మాత్రమే పరిమితం కావడంతో మీడియం రేంజ్ హీరోలకు ఇప్పట్లో అవకాశాలు లేవనే చెప్పాలి.

దీనికోసం సుకుమార్ మంచి ప్లాన్ వేశాడు. తన బ్రాండ్ తో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ని స్థాపించి అందులో మీడియం, చిన్న హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన నిర్మించిన 'కుమారి 21 ఎఫ్' సినిమా ఘన విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు అదే బ్యానర్ లో కాస్త భారీ బడ్జెట్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. 'కుమారి 21 ఎఫ్' సినిమాను డైరెక్ట్ చేసిన సూర్య ప్రతాప్ తోనే ఈసారి కూడా సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమాకి సుకుమార్ కథ, కథనం, మాటలు అందిస్తాడు.ఆ నమ్మకంతోనే హీరో నితిన్ ఇప్పుడు ఈ సినిమా చేయడానికి అంగీకరించాడు. 

ఫ్లాపుల్లో ఉండడంతో సుకుమార్ బ్రాండ్ తనకు కలిసొస్తుందని నమ్మి దిగిపోతున్నాడు నితిన్. మరి అనుకున్నట్లుగా సుకుమార్ అతడికి సక్సెస్ ఇవ్వగలడో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటు నితిన్ 'భీష్మ' అనే మరో సినిమా కూడా ఓకే చేశాడు. దీనికి వెంకీ కుడుముల డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?