కమల్ హాసన్ సినిమాపై శ్రుతిహాసన్ ఆవేదన... అభిమానులపై సంచలన కామెంట్స్..

Published : Dec 28, 2025, 03:27 PM IST
Shruti Haasan

సారాంశం

ప్రముఖ హీరోయిన్   శ్రుతిహాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రీసెంట్ గా  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన తండ్రి దర్శకత్వంలో విడుదలైన సినిమాపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ విషయం ఏంటి? 

కమల్ హాసన్ డైరెక్ట్ చేసిన సినిమా..

కమల్ హాసన్ స్క్రీన్‌ప్లే రాసి దర్శకత్వం వహించిన సినిమా 'హే రామ్'. 2000లో విడుదలైన ఈ సినిమాను ఇప్పుడు ఒక క్లాసిక్‌గా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం, ఈ సినిమా గురించి శ్రుతి హాసన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సినిమా విడుదలైనప్పుడు దాన్ని చూడటానికి ఎవరూ లేరని, కానీ ఇప్పుడు ఆ సినిమాను ఒక క్లాసిక్ అని అంటున్నారని శ్రుతి హాసన్  అన్నారు. ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.

 ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్ మాట్లాడుతూ..   ‘’నాన్న కమల్ హాసన్  దర్శకత్వం వహించిన హే రామ్ సినిమాను ఇటీవల థియేటర్‌లో చూశాను. ప్రతి ఫ్రేమ్‌ను ఆయన తీర్చిదిద్దిన విధానం ప్రశంసనీయం. రీసెంట్ గానే  ఈ సినిమా మళ్లీ విడుదలైంది. క్యూబ్స్ థియేటర్‌లో ఆ సినిమా చూసిన అనుభవాన్ని మాటల్లో చెప్పలేను. అంతగా ఆశ్చర్యపోయాను. ఈ రోజు ఆ సినిమాను చాలామంది ఆకాశానికెత్తుతున్నారు. కమల్ సార్ ఇంత అద్భుతంగా ఈ సినిమాను ఎలా తీశారని చాలామంది అడుగుతున్నారు. కానీ, సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరూ మెచ్చుకోలేదు" అని శ్రుతి హాసన్ అన్నారు. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ ఈ విధంగా స్పందించారు. ‘

కమల్ హాసన్ సినిమాలు..

ఇక  కమల్ హాసన్ వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.  ఆయన  కొత్త సినిమాకు సౌత్ ఇండియా యాక్షన్ డైరెక్టర్లు అన్బరివు మాస్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళం నుంచి శ్యామ్ పుష్కరన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుందని సమాచారం.

మరోవైపు శ్రుతిహాసన్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె చివరిగా నటించిన 'కూలీ' ఈ ఏడాదే విడుదలైంది. ఆ సినిమాలో రజినీకాంత్ కూతురిగా ఆమె నటించారు. ఆ తర్వాత మిస్కిన్ దర్శకత్వంలో వస్తున్న 'ట్రైన్' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా శ్రుతి కనిపించనుంది. ఇది కాకుండా, విజయ్ దళపతి  'జననాయగన్'  సినిమాలో కూడా శ్రుతిహాసన్  కనిపించబోతున్నట్టు చెబుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే మందు పార్టీ చేసుకున్న హీరో.. చివరికి ఆంజనేయస్వామిపై ఒట్టేసి..
దళపతి విజయ్ వర్సెస్ రజనీకాంత్, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా?