
అడవిశేష్ విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఆయన ఎక్కువగా పోలీస్, ఆర్మీ, స్పై బేస్డ్ చిత్రాలే చేశారు. ఇప్పుడు కూడా అలాంటి సినిమాలు చేస్తున్నారు. దీంతో అడవి శేష్ అంటే ఇలాంటి సినిమాలకే పరిమితమనే కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో రూట్ మార్చాడు శేష్. జోనర్ మారుస్తున్నారు. స్పై, యాక్షన్ చిత్రాల నుంచి లవ్ స్టోరీల వైపు టర్న్ తీసుకున్నారు. తాజాగా ఆయన ప్రేమ కథకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
అడవిశేష్ లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఆయన డాన్సులు చేయరు, పాటలకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వరు. కానీ యాక్షన్ మాత్రం చేస్తారు. అందుకే ఇప్పటి వరకు అలాంటి చిత్రాలే చేశారు. కానీ ఇప్పుడు లవ్ స్టోరీలు చేస్తున్నారు. లేటెస్ట్ గా కొత్త సినిమాని ప్రకటించారు. ఇది లవ్ ప్రధానంగా సాగుతుందట. అయితే ఇందులో హీరోయిన్ ఎవరో కూడా ప్రకటించారు. శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తుందని తెలియజేయడం విశేషం.
కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న శృతి.. అడవిశేష్‌తో సినిమా చేయడం ఆశ్చర్యంగా ఉంటే, ఇప్పుడు కొత్తగా లవ్ స్టోరీ చేయడం మరింత డిఫరెంట్‌గా ఉంది. అడవి శేష్‌కి జోడీగా శృతి కనిపించబోతుంది. ఇద్దరు కలిసి ట్రావెల్ కానున్నారు. దీనికి సునీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో, ఏషయన్ సునీల్ సంయుక్తంగానిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ అటు అడవి శేష్, శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ఇక శృతి హాసన్.. ప్రస్తుతం `సలార్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. మరోవైపు ఇటీవల `హాయ్ నాన్న` సినిమాలో మెరిసింది. పాటలో కనిపించింది. ఇక ప్రారంభంలో `వాల్లేర్ వీరయ్య`, `వీరసింహారెడ్డి` చిత్రాలతో ఆకట్టుకుంది. ఇక అడవి శేష్ చివరగా `హిట్ 2 సినిమాతో ఆకట్టుకున్నాడు. కొంత గ్యాప్‌తో ఇప్పుడు `గూఢచారి 2`లో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త సినిమాతో రాబోతున్నారు.