యంగ్ హీరోయిన్ తో డేటింగ్ పై ఆదిత్య రాయ్ కపూర్ క్లారిటీ? లిఫ్ట్ లో ఉంటే అలా చేస్తారా?

Published : Dec 12, 2023, 03:23 PM ISTUpdated : Dec 12, 2023, 03:27 PM IST
యంగ్ హీరోయిన్ తో డేటింగ్ పై ఆదిత్య రాయ్ కపూర్ క్లారిటీ?  లిఫ్ట్ లో ఉంటే అలా చేస్తారా?

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తాజాగా సెన్సేషనల్ షో ‘కాఫీ విత్ కరణ్’కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన డేటింగ్ రూమర్లపైనా ఆసక్తికరంగా స్పందించారు.    

బాలీవుడ్ స్టార్ ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapur) ‘ఆషికీ2’ చిత్రంతో సౌత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ప్రస్తుతం హిందీలోనే పలు చిత్రాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. అయితే కొద్దిరోజులు ఆదిత్య రాయ్ కపూర్ యంగ్ హీరోయిన్ తో డేటింగ్ ఉన్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో దానిపై బాలీవుడ్ స్టార్ స్పందించారు. 

తాజాగా హిందీలో కొనసాగుతున్న ‘కాఫీ విత్ కరణ్’ (Koffee with Karan)  సీజన్ 8కు ఆదిత్యరావ్ కపూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సెన్సేషన్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ ఆదిత్య రావ్ కపూర్, అర్జున్ కపూర్ ను గ్రాండ్ గా స్వాగతించారు. ఇక షో కొనసాగింపులో ఆదిత్య రావ్ కు ఆసక్తికరమైన ప్రశ్నలను సంధించారు. ముఖ్యంగా ‘లైగర్’ హీరోయిన్ అనన్య పాండే (Ananya Panday) తో డేటింగ్ పై ప్రశ్నలు కురిపించారు. 

ఇందుకు ఆదిత్య రావ్ కపూర్ ఆసక్తికరంగా బదులిచ్చారు. ఆయన మాట్లాడుతూ ... ‘నన్ను సీక్రెట్స్ అడగొద్దు. నేను అబద్దాలు చెప్పలెను’ అంటూ తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బదులిచ్చారు. ఆ తర్వాత ఒకే లిఫ్ట్ లో అనన్య, శ్రద్దా కపూర్ తో మీరుంటే.. లిఫ్ట్ సడెన్ గా ఆగిపోతే ఏం చేస్తారు? అంటూ ఆదిత్యను ప్రశ్నించారు. ఇందుకు పక్కనే ఉన్న అర్జున్.. ‘రొమాన్స్ చేస్తాడు.. కానీ ఎవరితో అన్నది తెలియదు’ అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. సరదాగా చెప్పానంటూ చెప్పుకొచ్చారు. 

ఇక కొన్నాళ్లుగా అనన్య పాండేతో ఆదిత్య రాయ్ కపూర్ డేటింగ్ లో ఉన్నారని తెలుస్తోంది. వారిద్దరూ పలు ఈవెంట్లకూ జంటగా హాజరవుతూ షాకిస్తున్నారు. ఈ క్రమంలో రూమర్లు మరింత ఊపందుకుంటున్నాయి. ఎప్పుడూ డేటింగ్ రూమర్లపై ఇద్దరూ స్పందించలేదు. అలా అనీ ఖండించనూ లేదు. దీంతో ఫుల్ ఎపిసోడ్ లో ఆదిత్య ఇంకెలాంటి సమాధానాలు చెప్పారనేది ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 14న ఫుల్ ఎపిసోడ్ రానుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే