నానికి జోడీగా శృతి హాసన్‌.. ఈ రోజు నుంచే షూటింగ్‌..

Published : Apr 29, 2023, 06:28 PM IST
నానికి జోడీగా శృతి హాసన్‌.. ఈ రోజు నుంచే షూటింగ్‌..

సారాంశం

ఈ ఏడాది ఒకేసారి రెండు హిట్లు అందుకుని ఫుల్‌ జోష్‌లో ఉంది హీరోయిన్‌ శృతి హాసన్‌. ఇప్పుడు అనూహ్యంగా నాని సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏకంగా షూటింగ్‌లో కూడా పాల్గొంది.

హీరోయిన్‌ శృతి హాసన్‌ ఈ ఏడాది బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు హిట్లు అందుకుంది. చిరంజీవితో `వాల్తేర్‌ వీరయ్య`, బాలకృష్ణతో `వీర సింహారెడ్డి` చిత్రాలు చేసింది. ఇప్పుడు మరో తెలుగు సినిమాకి సైన్‌ చేసింది. ఫస్ట్ టైమ్‌ నేచురల్‌ స్టార్‌ నాని సినిమాలో నటిస్తున్నారు. నేటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటుందట. నాని ఇప్పుడు తన `నాని30` చిత్రంలో నటిస్తున్నారు. కొత్త దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నానికి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా నటిస్తుంది. ఇప్పుడు మరో హీరోయిన్‌గా శృతి హాసన్‌ని ఎంపిక చేశారు. అయితే ఆమె కీలక పాత్రలో కనిపిస్తుందని చిత్ర బృందం వెల్లడించడం విశేషం. 

మరి శృతి ఇందులో.. నానికి జోడీగానే కనిపిస్తుందా? లేక పూర్తిగా ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌తో కనిపిస్తుందా అనేది చూడాలి. ఇక `దసరా` హిట్‌ తర్వాత నాని నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నానికి ఓ కూతురు కూడా ఉంటుంది. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్‌తో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ గోవాలో జరుగుతుంది. ఓ పెద్ద షెడ్యూల్‌ని చిత్రీకరిస్తున్నారు. చాలా రోజులుగా గోవాలోనే చిత్రీకరణ జరుగుతుంది. 

ఇక నేటి నుంచి శృతి హాసన్‌ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుందని చిత్ర బృందం తెలిపింది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారట. ఇది లాంగ్‌ షెడ్యూల్‌ అని తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో లార్జ్ స్కేల్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమాకి హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం అందిస్తున్నారు. సాను జాన్‌ వరుగేసే కెమెరామెన్‌గా, ప్రవీణ్‌ ఆంథోనీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 21న విడుదల చేయబోతున్నారు. 

ఇక శృతి హాసన్‌ ప్రస్తుతం ప్రభాస్‌తో `సలార్‌` చిత్రంలో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్‌ కాబోతుంది. దీంతో ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో సందడి చేయబోతుందని చెప్పొచ్చు. ఇప్పటికే సంక్రాంతికి రెండు సినిమాలతో అలరించిన విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది