సినిమాని చంపేది ఓటీటీలు, టీవీ కాదు.. పాప్‌ కార్న్ చంపుతుంది.. దర్శకుడు తేజ షాకింగ్‌ కామెంట్స్

By Aithagoni RajuFirst Published Apr 29, 2023, 5:41 PM IST
Highlights

దర్శకుడు తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్టీఫ్లెక్స్‌ ల్లో అమ్మే పాప్ కార్న్, కోక్‌, సమోసాలపై ఆయన షాకింగ్‌ కామెంట్స్ చేశారు. అవే సినిమాలను చంపుతున్నాయని పేర్కొన్నారు.

దర్శకుడు తేజ.. ముక్కుసూటి మనిషి. ఏదైనా బోల్డ్ గా మాట్లాడతాడు. ఎవరికీ బయపడరు. ఆయన ఏదైనా విషయంపై మాట్లాడితే అది హాట్‌ టాపిక్‌ అవ్వాల్సిందే. తాజాగా ఆయన మల్టీప్లెక్స్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్టీఫ్లెక్స్ ల్లో పాప్‌ కార్న్ రేట్లు అధికంగా ఉంటున్నాయని, టికెట్‌ రేట్ల కంటే ఈ పాప్‌కార్న్, కోక్‌, సమోసాల రేట్లు ఎక్కువగా ఉండటంతో ఆయా మల్టీప్లెక్స్ లో సినిమా చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపించడం లేదన్నారు తేజ. 

తాజాగా ఆయన `రామబాణం` ప్రమోషన్స్ లో భాగమయ్యారు. అందులో భాగంగా హీరో గోపీచంద్‌ని ఇంటర్వ్యూ చేశారు. `రామబాణం` సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. దర్శకుడు శ్రీవాస్‌లో నచ్చిన విషయం, సినిమా కాన్సెప్ట్ వంటి విషయాలపై చర్చించుకున్నారు. ఈ క్రమంలో ఓటీటీలు, థియేటర్లలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. ఇందులో భాగంగా తేజ బోల్డ్ గా రియాక్ట్ అయ్యారు. 

Latest Videos

ఓటీటీల కారణంగా సినిమా థియేటర్లలో ఆడటం లేదని, కొన్ని రోజులకే పరిమితమవుతుందని, చాలా వరకు ఆడియెన్స్ థియేటర్‌కి రావడం లేదని, దీంతో ఓటీటీలు సినిమాలను చంపేస్తున్నాయనే కామెంట్లు తరచూ వినిపిస్తున్నాయి. కానీ దానికి భిన్నంగా దర్శకుడు తేజ స్పందించారు. సినిమాలను చంపేది ఓటీటీలు, టీవీలు కాదని, పాప్‌కార్న్ అంటూ షాకిచ్చారు. మల్టీఫ్లక్స్ ల్లో పాప్‌కార్న్, కోక్‌, సమోసాల రేట్లు దారుణంగా పెంచారని, దీంతో సాధారణ ప్రజలు వాటిని కొనలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. 

చాలా వరకు ఆడియెన్స్ పాప్‌ కార్న్ తింటూ, కోక్‌ తాగుతూ సినిమా చూడాలనుకుంటాడు. అందులోనే మజా ఉంటుందని, అప్పుడే సినిమాని ఎంజాయ్‌ చేస్తారని, తాను మాత్రం పాప్స్ కార్న్ తింటూనే సినిమా చూస్తానని, అప్పుడే ఎంజాయ్‌ చేస్తానని తెలిపారు. చాలా మంది తనకు మల్టీప్లెక్స్ ల్లో పాప్‌కార్న్, కోక్‌, సమోసా రేట్లు ఎక్కువగా ఉంటున్నాయని, కొనలేని స్థితిలో ఉన్నాయని అందుకే మల్టీప్లెక్స్ లకు వెళ్లలేకపోతున్నామని అంటున్నారు. దీని కారణంగానే సినిమా చనిపోతుంది. నిజానికి సినిమాని చంపేది ఓటీటీలు, టీవీ కాదు పాప్‌ కార్న్ మాత్రమే చంపగలదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

అంతేకాదు బాలీవుడ్‌పై కూడా ఆయన స్పందించారు. హిందీలో సినిమాలు చచ్చిపోవడానికి కారణం ఆడియెన్స్ కాదు, మల్లీఫ్లెక్స్ ల్లో అమ్మే పాప్‌ కార్న్ రేట్లే చంపేశాయి. తెలుగులో చాలా వరకు సింగిల్‌ స్క్రీన్లున్నాయి. అందుకే ఇది సినిమా బతికి ఉంది.  ప్రేక్షకులు సింగిల్  థియేటర్లకి వెళ్లాలని,  అందులో సినిమా పెద్దగా కనిపిస్తుందన్నారు. కానీ చాలా మల్టీ ఫ్లెక్స్ లలో చిన్న  స్క్రీన్లు ఉంటున్నాయని, సినిమా పెద్దగా కనిపించదని చెప్పారు.

మల్టీ ఫ్లెక్స్ లు ఎక్కువైన ఏరియాలో సినిమా చచ్చిపోతుంది. అందుకు కారణం పాప్ కార్న్ ధరలు. ఓటీటీలు, టీవీలు సినిమాను చంపలేవు. కేవలం పాప్ కార్న్ మాత్రమే సినిమాను చంపగలదంటూ దర్శకుడు తేజ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  ఇక గోపీచంద్‌ హీరోగా, డింపుల్‌ హయతి హీరోయిన్‌గా జగపతిబాబు, ఖుష్బు కీలక పాత్రల్లో నటించిన `రామబాణం` చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. సినిమా మే 5న విడుదల కానుంది. 
 

click me!