శృతీహాసన్ కు నచ్చిన ఆనాటి రొమాన్స్

Published : Jan 04, 2017, 11:07 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
శృతీహాసన్ కు నచ్చిన ఆనాటి రొమాన్స్

సారాంశం

శృతి హాసన్ కు ఆనాటి రొమాన్స్ అంటేనే ఇష్టం స్మార్ట్ ఫోన్లు లేని రోజుల్లో పెద్దలను తప్పించుకోవటమే రొమాన్స్ అదే తనకిష్టమంటున్న శృతి

తల్లిదండ్రుల బ్రాండ్ ఇమేజ్ ను కేవలం ఎంట్రీకి మాత్రమే కూడా వాడుకోకుండా... మ్యూజిక్,,, యాక్టింగ్ ఇలా తనదైన స్టైల్ తో శ్రుతీహాసన్‌ మోడ్రన్‌ అమ్మాయిలకు రోల్‌ మోడల్‌ అన్నట్టు కనిపిస్తుంది. ఇంత మాడ్రన్ గా కనిపించే శృతీ హాసన్ రొమాన్స్ విషయానికొస్తే మాత్రం చాలా ఓల్డ్. ఆమెకు మోడ్రన్‌ డేస్‌ రొమాన్స్‌ కంటే పాత రోజుల్లో జరిగిన రొమాన్సే ఇష్టమట!

 

‘‘మా రోజుల్లో వాట్సాప్, ఇతరత్రా మొబైల్‌ యాప్స్‌ లేవు. అందువల్ల, అందరూ నేరుగా కలుసుకుని మాట్లాడుకునేవారు. మీటింగులు, మాటల వల్లే సగం ప్రేమకథలు చిగురించేవి’’ అని తన తండ్రి కమల్‌హాసన్‌ శ్రుతీతో అప్పుడెప్పుడో చెప్పారట! ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ అలాంటి రొమాన్స్ ఉంటేనే లైఫ్ లో కిక్ ఉంటుందని చెప్తోంది శృతి.

 

‘ల్యాండ్‌లైన్‌కి బాయ్‌ఫ్రెండ్‌ కాల్‌ చేస్తే ఎక్కడ అమ్మ ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తుందో అని కంగారు... కేవలం కాల్,మెసేజ్ మాత్రమే చేయగల ఫోన్లు, ఇంట్లో తెలియకుండామెసేజ్లు పంపుకోవడాలు.. ఎంతైనా ఆ రోజులే వేరు. నాన్న చెప్పిన ప్రేమకథలు నాకింకా గుర్తున్నాయి. ఇప్పటి యువతరమంతా అటువంటి రొమాంటిక్‌ మూమెంట్స్‌ని మిస్‌ కావడం బాధాకరం. నాకు ఓల్డ్‌  స్టైల్  సింపుల్‌ రొమాన్స్‌ అంటేనే ఇష్టం’’ అంటోంది శృతి.

PREV
click me!

Recommended Stories

'సంక్రాంతికి వస్తున్నాం' రీమేక్ లో హీరోయిన్ గా 46 ఏళ్ళ నటి.. దిల్ రాజు ప్లానింగ్ ఇదే
ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చిన చీరను.. మూడేళ్లు దాచుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?