రాజీ లేకుంటే జీవితమే లేదంటున్న బ్యూటీ

Published : Jan 23, 2017, 08:04 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
రాజీ లేకుంటే జీవితమే లేదంటున్న బ్యూటీ

సారాంశం

బంధం నిలబడాలంటే కాంప్రమైజ్ కావాల్సిందేనంటున్న శృతీహాసన్ ఇద్దరి మధ్య రాజీ లేకుంటే జీవితమే లేదంటున్న సుందరి

తన తండ్రి కమల్ హాసన్ తో గౌతమి బంధం విడిపోయినందుకు ఫీలైందో లేక గుస్సా అయిందో తెలియట్లేదు కానీ శృతీ హాసన్ రిలేషన్ షిప్స్ గురించి తెగ లెక్చర్ పీకుతోంది. ఇప్పుడంతా ఫాస్ట్‌ ఫుడ్‌ కల్చర్‌. చటుక్కున తినేయాలి.. చిటుక్కున పనుల్లో పడిపోవాలి. అంతా వేగం. బంధాలకు ప్రాధాన్యం ఇవ్వలేనంత బిజీ బిజీగా కొంతమంది ఉంటున్నారు. చిన్న చిన్న మనస్పర్థలకే విడిపోవడం... బంధాలకు విలువ లేకుండాపోతోంది. ‘రిలేషన్‌షిప్స్‌’ గురించి శ్రుతీహాసన్‌ కూడా ఇలానే మంచి మాట చెప్పారు.

 

‘‘కాంప్రమైజ్‌ కాకపోతే జీవితం అస్తవ్యస్తమే. ఎక్కడ రాజీపడాలో అక్కడ పడితేనే జీవితం బాగుంటుంది. ముఖ్యంగా బంధాలను కాపాడుకోవాల్సిన విషయంలో రాజీ పడాల్సిందే. అక్కడ లేనిపోని గొప్పలకు పోతే ఆ బంధం తెగిపోతుంది. ఒకప్పుడు స్నేహంలో అయినా, వివాహ బంధంలో అయినా రాజీ అనేది ఉండేది. సర్దుకుపోయేవాళ్లు. ఇప్పుడలా ఇష్టపడటంలేదు. రాజీపడటం తగ్గింది కాబట్టి.. విడిపోవడాలు ఎక్కువైపోయాయి. చిన్నపాటి రాజీవల్ల ఓ బంధం నిలబడుతుందనుకున్నప్పుడు సర్దుకుపోవాలి. ఒకవేళ ఆ బంధం వల్ల జీవితాంతం ఇబ్బందులపాలు కావల్సి వస్తుందనిపిస్తే అప్పుడు రాజీ పడకూడదు’’ అంటోంది శృతి.

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu:లక్ష గెలిచిన బాలు, మీనా. చూసి తట్టుకోలేకపోయిన ప్రభావతి, రోహిణీకి కొత్త చిక్కులు
Chiranjeevi: చిరంజీవి నా వల్లే ఎదిగారు అంటూ కామెంట్.. చేసింది ఒక్క సినిమానే, అది కూడా అట్టర్ ఫ్లాప్