ఆడియో విడుదలకు సిద్దమవుతున్న కన్నయ్య

Published : Jan 22, 2017, 08:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
ఆడియో విడుదలకు సిద్దమవుతున్న కన్నయ్య

సారాంశం

ఆడియో విడుదలకు సిద్దమవుతున్న కన్నయ్య

పాపిన్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై విపుల్-హర్షిత జంటగా జాదవ్ రాజేష్ బాబు-పగడాల కృష్ణంరాజు-తిరువాయిపాటి రవితేజలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఈ చిత్రానికి విపుల్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఆడియో వేడుకను జనవరి నెలాఖరులో ఘనంగా నిర్వహించి.. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నద్ధమవుతున్నారు. నిన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించిందని, సత్య కశ్యప్ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు కూడా అదే స్థాయిలో అలరించడం ఖాయమని, ఉత్తేజ్, సత్యకృష్ణన్, కాశీవిశ్వనాధ్ ల పాత్రలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయని, లవ్లీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందని దర్శకనిర్మాతలు తెలిపారు. 

ఈ చిత్రానికి ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, కెమెరా: జవహర్ రెడ్డి, మ్యూజిక్: సత్య కశ్యప్, కో-డైరెక్టర్: మంతెన నరేందర్, నిర్మాతలు: జాదవ్ రాజేష్ బాబు-పగడాల కృష్ణంరాజు-తిరువాయిపాటి రవితేజ, రచన-దర్శకత్వం: విపుల్

PREV
click me!

Recommended Stories

Prabhas: ప్రభాస్ పై డైరెక్టర్ కూతురు కామెంట్స్.. వీడియో ఎంతలా వైరల్ అవుతోందో తెలుసా
Gunde Ninda Gudi Gantalu:లక్ష గెలిచిన బాలు, మీనా. చూసి తట్టుకోలేకపోయిన ప్రభావతి, రోహిణీకి కొత్త చిక్కులు