‘వకీల్ సాబ్’ లో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే విశేషం

Published : Mar 09, 2020, 07:49 AM ISTUpdated : Mar 14, 2020, 02:57 PM IST
‘వకీల్ సాబ్’ లో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే విశేషం

సారాంశం

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’ . హిందీ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో... పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు.  ఉమెన్ ఎమ్పవర్మెంట్ మరియు భద్రత వంటి విషయాలను ప్రస్తావిస్తూ సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా..

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’ . హిందీ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో... పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు.  ఉమెన్ ఎమ్పవర్మెంట్ మరియు భద్రత వంటి విషయాలను ప్రస్తావిస్తూ సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా..నిన్న ఉమెన్స్ డే సంధర్భంగా ఈ చిత్రం నుండి ఓ లిరికల్ సాంగ్ విడుదల చేస్తే ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ చిత్రం కథ ప్రకారం పవన్ భార్య పాత్ర కోసం ఓ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో వచ్చే  కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో పవన్ భార్య తో ఉండే ఎపిసోడ్ ఒకటుంది.  ఆ ఎపిసోడ్ లో ...తమిళ్ లో అజిత్ సరసన విద్యా బాలన్ చేయగా తాజాగా తెలుగులో అదే పాత్రను శృతి హాసన్ చేయబోతున్నట్టు హాట్ అప్ డేట్.  ఇప్పటికే ఈ విషయంపై ఆమెని సంప్రదించటం, ఒప్పుకోవడం జరిగిందని సమచారం. కథ ప్రకారం ఈ పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండదు. అయినా గుర్తుండిపోయే పాత్ర కావటంతో శృతి సరేనందిట.  

గతంలో వీరిద్దిరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డ్ హిట్ . ఆ చిత్రం తర్వాత శృతి హాసన్  టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వరసగా రవితేజ, మహేష్ బాబు లాంటి స్టార్ల సరసన వరస సినిమాలు చేసింది. ఇప్పుడు రవితేజ క్రాక్ తో ఫ్రెష్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శృతి హసన్ కు వకీల్ సాబ్ ఆఫర్ అంటే మంచి ఆఫర్. ఇన్ సైడ్ టాక్ ప్రకారం తనకు పవన్ కు,శృతితో ఒక డీసెంట్ ఎమోషనల్ సాంగ్ ఉంటుందట. అలాగే కీలక పాత్రలో నివేదా థామస్ నటిస్తోంది, కాని ఆమె పవన్ కు జోడి కాదు. కథలో ముఖ్యమైన బాధితురాలి పాత్రలో నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?