పంజాబీ పిల్లతో రామ్ చరణ్ లవ్ ఎఫైర్ ?

By tirumala AN  |  First Published Mar 8, 2020, 5:21 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కోసం క్రేజీ దర్శకులంతా క్యూ కడుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


మెగా పవర్ స్టార్ రాంచరణ్ కోసం క్రేజీ దర్శకులంతా క్యూ కడుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. 

ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ తో సినిమా చేసే దర్శకుల జాబితాలో కొరటాల శివ, భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల, సాహో సుజిత్ లాంటి దర్శకులు ఉన్నారు. ఆ జాబితాలోకి ప్రతిభగల గౌతమ్ తిన్ననూరి కూడా చేరాడు. 

Latest Videos

గౌతమ్ తిన్ననూరి ఇటీవల రామ్ చరణ్ ని కలసి అద్భుతమైన ప్రేమ కథ నేరేట్  చేసినట్లు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి చిత్రాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. రాంచరణ్ కు వినిపించిన కథ విషయానికి వస్తే.. తెలుగు కుర్రాడు పంజాబీ యువతితో ప్రేమలో పడే చిత్రం అట ఇది. కథని గౌతమ్ తిన్ననూరి చాలా అందంగా సిద్ధం చేసుకున్నాడట. 

ఓ పంజాబీ యువతిని తెలుగు అబ్బాయి ప్రేమిస్తే ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనే కోణంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వినగానే ఈ కథ రామ్ చరణ్ కు తెగ నచ్చేసింది వార్తలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో కథకు మెరుగులు దిద్దమని చరణ్ గౌతమ్ కు సూచించినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం హిందీలో షాహిద్ కపూర్ తో జెర్సీ రీమేక్ చేస్తున్నాడు.

click me!