కమల్ తో పొలిటికల్ ఎంట్రీ.. క్లారిటి ఇచ్చిన శృతి హాసన్!

Published : Apr 01, 2019, 06:57 PM IST
కమల్ తో పొలిటికల్ ఎంట్రీ.. క్లారిటి ఇచ్చిన శృతి హాసన్!

సారాంశం

  కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు గత కొంత కాలంగా కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే శృతి హాసన్ ప్రతిసారి రూమర్స్ పై స్పందిస్తున్నప్పటికీ వాటి డోస్ తగ్గడం లేదు. 

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు గత కొంత కాలంగా కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే శృతి హాసన్ ప్రతిసారి రూమర్స్ పై స్పందిస్తున్నప్పటికీ వాటి డోస్ తగ్గడం లేదు. ఎందుకంటే తండ్రి కమల్ హాసన్ మక్కల్ నిధి మయ్యమ్ పార్టీని స్థాపించి సినీ తారలను చేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. 

ఇక సొంత కూతురు పార్టీకి సపోర్ట్ గా ఎందుకు రాదూ అనే టాక్ బాగా వైరల్ అయ్యింది. ఇకపోతే ఫైనల్ గా శృతి తండ్రి పార్టీకి మద్దతు ఇస్తానను చెప్పింది. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా పార్టీకి బ్యాక్ గ్రౌండ్ నుంచి తనదైన సలహాలు ప్రణాళికలు అందిస్తుందట. తన తండ్రి లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే జనాలకు మంచి జరుగుతుందని శృతి వివరణ ఇచ్చింది. 

అదే విధంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీ ప్రజల్లోకి వెళ్లేలా తండ్రితో ఎప్పటికప్పుడు చర్చలు జరిపేందుకు శృతి సిద్ధంగా ఉందట. మరి ఈ బ్యూటీ సహకారం కమల్ పార్టీకి ఏ,ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇక కమల్ హాసన్ త్వరలోనే తన అసలైన రాజకీయ ప్రణాళికలపై వివరణ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.  

PREV
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్