శృతీ హాసన్ కారులోనే అతన్ని కౌగిలిలో బంధించేసి.. ముద్దూ ముచ్చట..

Published : Jul 27, 2017, 06:41 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
శృతీ హాసన్ కారులోనే అతన్ని కౌగిలిలో బంధించేసి.. ముద్దూ ముచ్చట..

సారాంశం

బోయ్ ఫ్రెండ్ మైఖేల్ తో పీకల్లోతు ప్రేమలో శృతీ హాసన్ ఎయిర్ పోర్ట్ లో కలవగానే కారులో జంప్ చేసి మైఖేల్ పై బడింది కౌగిలిలో బంధించి మైఖేల్ ను ఉక్కిరి బిక్కిరి చేసిన శృతీహాసన్

కమల్ హాసన్ గారాల పట్టి సౌత్ లోనే కాక బాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన శృతీ హాసన్ తెలుగులో టాప్ హీరోయిన్ రేసులో వుంది. అంతటి క్రేజ్ వున్న శృతిహాసన్ ప్రస్థుతం తన ప్రియుడు మైఖేల్ కోర్సేల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిందని అనేక సందర్భాల్లో మీడియాలో  నానింది. గతంలో ముంబై ఎయిర్‌పోర్టులో ప్రియుడితో కలిసి మీడియా కంటపడింది శృతి.

 

ఇక ఇటీవల మైఖేల్‌తో కలిసి శృతిహాసన్‌ లండన్ వెళ్లిందని, అతడిని పెళ్లి చేసుకోవడం కోసమే సంఘమిత్ర చిత్రం నుంచి తప్పుకుందని విస్తృతంగా ప్రచారమయింది. ప్రస్తుతం తన ప్రియుడికి దూరంగా ఉండలేని పరిస్థితిలో శృతిహాసన్ ఉన్నట్టు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల ప్రియుడు మైఖేల్ కోర్సలేతో వ్యవహరించిన తీరు మరోసారి మీడియా పతాక శీర్షికలను ఆకర్షించింది. ఇటీవల ఎయిర్‌పోర్టులో వారిద్దరూ కలుసుకొన్నారు. లండన్ నుంచి వచ్చిన మైఖేల్‌ను చూసి శృతి ఆనందంతో పరవశించిపోయింది. ఆ అందమైన కౌగిలిని పలువురు ఫోటోగ్రాఫర్లు చటుక్కున పట్టేశారు.

 

ఎయిర్‌పోర్టులోనే అందరూ చూస్తుండగానే వాహనంలోకి దూకింది. వెంటనే కౌగిలిలో బంధించింది. మైఖేల్ ఒడిలో ఒదిగి తన్మయత్వంతో ఊగిపోయింది. కెమెరాలు తమను బంధిస్తున్నాయన్న విషయాన్ని పట్టించుకోకుండా శృతిహాసన్ కౌగిలిలోనే ఉండిపోవడం ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగి పోయిందని సూచిస్తోంది. వాళ్ల మధ్య ఉన్న ప్రత్యేకమైన రిలేషన్.. అబద్ధం ఆడటానికి వీలులేకుండా తాజా ఫొటోలు బలాన్ని ఇస్తున్నాయి. ఇద్దరి మధ్య క్రెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తున్నది. గతంలో మైఖేల్‌తో అఫైర్‌ను బహిరంగ పరచడానికి ఆసక్తి చూపలేదు. కానీ ప్రస్తుతం ఎవరు ఏమనుకున్నా పట్టించుకొను అనే పరిస్థితి కనిపిస్తోంది.

 

“నా గురించి ఎవరు ఏమనుకొన్నా పట్టించుకోను. నా గురించి ఏమీ రాసిన నాకు ఇబ్బంది లేదు. నా వ్యక్తిగత జీవితాన్ని నేను స్లయిల్‌లో ఆస్వాదిస్తాను” అని శృతిహాసన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.  “లండన్‌లో మైఖేల్ కోర్సెలే థియేటర్ ఆర్టిస్ట్. ఇటీవల బ్రిటీష్ రాక్ బ్యాండ్ డైనోసార్ పైల్ అప్ కోసం ఓ పాట రికార్డింగ్‌కు శృతి లండన్‌లో పర్యటించింది. ఆ సందర్భంగా ఓ కామన్ ఫ్రెండ్‌ ద్వారా శృతితో మైఖేల్‌కు పరిచయం జరిగింది. వారి పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు” అని శృతి సన్నిహితులు అంటున్నారు.

 

ఇటీవల పవన్ సరసన కాటమరాయుడు చిత్రంలో కనిపించిన శృతిహాసన్ ప్రస్తుతం తండ్రి కమల్ హాసన్ రూపొందిస్తున్న శభాష్ నాయుడు చిత్రంలో నటిస్తోంది. తమిళంలో సుందర్ తలపెట్టిన భారీ ప్రాజెక్ట్ సంఘమిత్ర నుంచి శృతి తప్పుకోవడం తమిళ చిత్ర పరిశ్రమలో ఓ వివాదంగా మారింది. మొత్తానికి శృతి ఓ బ్రిటిష్ వ్యక్తితో రొమాన్స్ చేయడం సినిమాను మించిపోయింది. వీళ్ల హడావుడి ఎటు వెళ్తుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే