హీరో అడివి శేష్ ను అభినందించిన మాజీ రాష్ట్రపతి.. ‘మేజర్’పై రామ్ నాథ్ కోవింద్ ప్రశంసలు

By Asianet News  |  First Published May 16, 2023, 1:18 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) నటించిన ‘మేజర్’ చిత్రానికి ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. తాజాగా భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభినందించారు. 
 


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ గతేడాది ‘మేజర్’(Major) చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. 2008 ముంబై దాడుల్లో అమర వీరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ టైటిల్ పాత్రలో అడివి శేష్ జీవించారు.  పాన్ ఇండియా ఫిల్మ్ గా విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.  

మేజర్ భారీ బ్లాక్ బస్టర్ కావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఆర్మీ సిబ్బంది, రాజకీయ నాయకులు, సినీ ప్రేక్షకులు తదితర అన్ని వర్గాల ప్రజలను ఈ చిత్రం ఆకట్టుకుంది. అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక తాజాగా హీరో అడివి శేష్ కు భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ (Ram Nath Covind) నుండి ఆహ్వానం అందుకున్నాడు. ఈ సందర్భంగా 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌ను రూపొందించినందుకు శేష్‌ని అభినందించారు. సినిమా అపూర్వ విజయం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆశీర్వదించారు. ఇది అతిపెద్ద విజయంగానూ, మేకర్స్‌కి గర్వకారణంగానూ ఉంటుందని ప్రశంసలు కురిపించారు.

Latest Videos

ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు  GMB ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, A+S మూవీస్ సంయుక్తంగా నిర్మించారు. మేజర్‌లో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ  హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కూడా కీలక పాత్రల్లో నటించారు. మేజర్ చిత్రం గతేడాది 24 మేన విడుదలైంది. రూ.66 కోట్ల వరకు ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అడివి శేష్ ప్రస్తుతం ‘గూఢచారి2’తో పాటు మరిన్ని చిత్రాల్లో నటిస్తున్న తెలుస్తోంది. 

click me!