మాజీ విశ్వ సుందరి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇటీవల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ నెట్టింటి నిలుస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ పై పొగడ్తల వర్షం కురిపించింది.
‘RRR’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) క్రైజ్ వైల్డ్ వైడ్ గా పెరిగింది. ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దక్కింది. ఈ క్రమంలో చరణ్ కు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు అందుతున్నాయని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా చరణ్ పై ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు.
అయితే ప్రియాంక చోప్రా అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మించిన ఒరిజినల్ సిరీస్ సిటాడెల్‌లో గూఢచారి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల వానిటీ ఫెయిర్ ఇంటర్వ్యూలో లై డిటెక్టర్ పరీక్ష చేయించుకున్నారు. పరీక్ష సమయంలో ఇంటర్వ్యూయర్ ప్రియాంకకు అనేక ప్రశ్నలు సంధించారు. ఇందుకు చురుకైన సమాధానాలు ఇచ్చింది.
ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ కు తన కోస్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ప్రశ్న ఎదురైంది. ‘రామ్ చరణ్‌ను బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మీరు అంగీకరిస్తారా?’ అంటూ ఇంటర్వ్యూయర్ ప్రియాంకను ప్రశ్నించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ ‘అవును, ఖచ్చితంగా. రామ్‌కి అపారమైన చరిష్మా ఉంది. అతను చాలా మంచి వ్యక్తి కూడానూ.’ అంటూ బదులిచ్చింది.
అలాగే బ్రాడ్ పిట్, చరణ్ ఎవరు ఎక్కువ అందగాడు అనే ప్రశ్నకు అడిగినప్పుడు, ప్రియాంక బదులిస్తూ, "నేను బ్రాడ్ పిట్‌పై ప్రేమతో పెరిగాను, కాబట్టి ఆ ప్రశ్న అడగడం రామ్‌కి అన్యాయం అవుతుంద’ని ప్రేర్కొంది. చివరిగా ‘రామ్ చరణ్ లేదా ఎన్టీఆర్ ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారు?’ అంటూ ప్రశ్నించగా.. చిరునవ్వు నవ్వి దాటవేసింది. ఇక రామ్ చరణ్ - ప్రియాంక చోప్రా జంటగా ‘జంజీర్’ (తుఫాన్)లో నటించిన విషయం తెలిసిందే. ఆస్కార్ ఈవెంట్ లో వీరు చాలా రోజుల తర్వాత కలవడం ఫ్యాన్స్ సంతోషంగా ఫీలయ్యారు. చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నారు.