హాట్ టాపిక్ గా మారిన శ్రధ్దా కపూర్ సాహో రెమ్యునరేషన్

Published : Aug 16, 2017, 07:51 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
హాట్ టాపిక్ గా మారిన శ్రధ్దా కపూర్ సాహో రెమ్యునరేషన్

సారాంశం

హాట్ టాపిక్ గా మారిన శ్రధ్దా కపూర్ సాహో రెమ్యునరేషన్ సాహోలో హీరోయిన్ గా అదికారికంగా కన్ఫమ్ అయిన శ్రద్ధా కపూర్ బాలీవుడ్ హీరోయిన్ కావడంతో భారీగా డిమాండ్ చేసిన శ్రద్ధ శ్రద్ధకు ఆరు నుంచి తొమ్మిది కోట్లు ముట్టాయని లీకులు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'సాహో' చిత్రానికి బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా ఖరారైందని అఫీషియల్ గా చెప్పేశారు. అయితే ఆమె ఈ సినిమాకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్. తెలుగు, తమిళం, హిందీ ఇలా మూడు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు. ఇందులో నుండి హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా కపూర్‌లకు రెమ్యూనరేషన్ భారీగా అందుతున్నట్లు సమాచారం.

 

ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ రూ. 12 కోట్లు డిమాండ్ చేసినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. శ్రద్ధా కపూర్ రేంజికి ఇది చాలా పెద్ద మొత్తమే. అయితే ఆమె అలా డిమాండ్ చేయడానికి ఓ కారణం ఉంది. కారణం అదే ఈ సినిమా మూడు భాషల్లో తెరకెక్కుతోంది. డేట్స్ కూడా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణ సినిమాతో పోలిస్తే ఈ చిత్రానికి రెట్టింపు శ్రమ పడాల్సి ఉంటుంది. అందుకే రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేసిందట.

 

సాధారణంగా శ్రద్ధా కపూర్ ఒక్కో సినిమాకు రూ. 4 కోట్లు చార్జ్ చేస్తుంది. ‘సాహో' మూవీ మూడు భాషల్లో తెరకెక్కుతోంది కాబట్టి ఒక్కో భాషకు రూ. 4 కోట్ల చొప్పున 12 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. బేరసారాల అనంతరం శ్రద్ధా కపూర్ 9 కోట్ల రెమ్యూనరేషన్‌కు ఒప్పుకుందని..... చాలా కాలం క్రితమే శ్రద్ధా కపూర్ పేరు బయటకు వచ్చినా, బేరసారాల కారణంగానే అఫీషియల్ ప్రకటన రావడం లేటయిందని టాక్.

 

150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.... ప్రభాస్ అందరికంటే భారీ మొత్తం అందుకుంటున్నాడు. ఆయన రెమ్యూనరేషన్‌గా రూ. 30 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. సినిమా నడిచేది ప్రభాస్ స్టార్ ఇమేజ్ మీదనే కాబట్టి ఆ మాత్రం ఇవ్వడం సబబే అనే వాదన వినిపిస్తోంది. ‘సాహో' షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది 2018లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే