
బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. దాని తర్వాత ఆయన చేస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రానికి రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ని నటిస్తోంది.
అయితే.. ఈ చిత్రంలో శ్రద్ధా డ్యూయల్ రోల్ చేస్తోందట. ఒకటి పాజిటివ్ క్యారెక్టర్ కాగా.. మరొకటి నెగటివ్ క్యారెక్టర్ అని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ హాట్ బ్యూటీ మందిరా బేడి ఈ సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తుండగా ఇప్పుడు శ్రద్ధా కూడా విలన్ గా అలరించనుందన్న ప్రచారం జరుగుతోంది. రూ.150కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకానుంది.