సైనా నెహ్వాల్ దగ్గర బ్యాడ్నింటన్ నేర్చుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ

Published : Sep 08, 2017, 06:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
సైనా నెహ్వాల్ దగ్గర బ్యాడ్నింటన్ నేర్చుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ

సారాంశం

సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ మూవీ బాలీవుడ్ చిత్రంలో సైనా పాత్ర పోషిస్తున్న శ్రద్ధా కపూర్ శ్రద్ధా కపూర్ కు బ్యాడ్మింటన్ మెళకువలు నేర్పిస్తున్న సైనా

భారతీయ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బయోపిక్ ను బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సైనా పాత్రను హీరోయిన్ శ్రద్దాకపూర్ పోషిస్తోంది. దీంతో, బ్యాడ్మింటన్ లో కోచింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చింది శ్రద్ధ. పుల్లెల గోపీచంద్ అకాడెమీలో గోపీచంద్, సైనాలతో కలసి ఆమె ట్రైనింగ్ సెషన్ లో పాల్గొంది. ఈ ట్రైనింగ్ కు సంబంధించిన ఫొటోలను సైనా నెహ్వాల్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. 'గోపీ సర్.. శ్రద్ధాకపూర్.. నేను' అనే కాప్షన్ ను ఫొటోకు జత చేసింది.

 

ఇక ప్రభాస్ సరసన సాహో చిత్రంలోనూ నటిస్తున్న శ్రద్ధ తెలుగు నేర్చుకోవటంలోనూ తన ప్రతిభ కనబరుస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు నేర్పించాలని ప్రభాస్ తో డీల్ కుదుర్చుకుందట ఈ ఆశిఖి2 భామ.

PREV
click me!

Recommended Stories

సౌత్ సినిమాలపై నోరు పారేసుకున్న హీరోయిన్, రాధికా ఆప్టే సంచలన కామెంట్స్ ..
5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?