సీఎం భార్య సినిమా టైటిల్ ఇదే..!

By Udayavani DhuliFirst Published Nov 14, 2018, 10:17 AM IST
Highlights

కర్నాటక సీఎం హెచ్ డి కుమారస్వామి రెండో భార్య రాధిక కుమారస్వామి ఒకప్పుడు హీరోయిన్ అనే విషయం తెలిసిందే. కుమారస్వామిని వివాహం చేసుకున్న తరువాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. మొన్నామధ్య ఆమె రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. 

కర్నాటక సీఎం హెచ్ డి కుమారస్వామి రెండో భార్య రాధిక కుమారస్వామి ఒకప్పుడు హీరోయిన్ అనే విషయం తెలిసిందే. కుమారస్వామిని వివాహం చేసుకున్న తరువాత ఆమె సినిమాలకు దూరమయ్యారు.

మొన్నామధ్య ఆమె రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆమె సినిమాలలో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో నవరసన్ అనే దర్శకుడు రూపొందిస్తోన్న సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకి 'దమయంతి' అనే టైటిల్ ని ఖరారు చేశారు.

నవంబర్ 12న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. లేడీ ఓరియెంటెడ్ కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాధిక కుమారస్వామి సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది. 1980వ సంవత్సరం బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ భారీగా ఉంటుందని తెలుస్తోంది. కన్నడలో ఈ సినిమాను రూపొందించి తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాతో పాటు రాధిక కుమారస్వామి 'భైరదేవి' అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో రమేష్ అరవింద్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.  

ఇవి కూడా చదవండి.. 

ఆ హీరోలతో రొమాన్స్ కి సిఎం భార్య రెడీ!

సిఎం భార్య మళ్లీ నటిస్తుందా?

కాబోయే సీఎం భార్య హీరోయిన్ అట!

click me!