ఆధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్ వేదికగా ఓ విన్నపం చేసుకున్నారు. అందరికి వరాలిస్తున్నారు.. మాకు కూడా ఇవ్వండి ప్లీజ్ అంటూ వేడుకున్నారు.
ప్రస్తుతం ఆంధ్రాలో టికెట్ రేట్ల ఇష్యూ గట్టిగా నడుస్తుంది. టికెట్ రేట్లు భారీగా తగ్గించి.. ప్రభుత్వం తన నియంత్రణలో పెట్టుకోవడంతో.. థియేటర్ యజమానులతో పాటు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఉక్కిరి బిగ్గిరి అవుతున్నాయి. రీసెంట్ గా హీరో నాని చేసిన కామెంట్లు ఇంకా హీట్ పుట్టించాయి. నానీ పై ఏపీ మంత్రులు కూడా ఫైర్ అయ్యారు. ఇక ఈ ఇష్యూ నడుస్తుండగానే ఫేమస్ యాక్టర్ బ్రహ్మాజీ సీఏం జగన్ కు ఓ ట్వీట్ చేశారు.
జగన్ సార్ అందరికి వరాలు ఇస్తున్నారు. మాకు కూడా అలాగే ఇవ్వండి. సినిమా వాళ్లకు కూడా సాయం చేయండి. థియేటర్ యజమానులకు సాయం చేయండి... అంటూ ట్వీట్ చేశారు బ్రహ్మాజీ. అంతే కాదు ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేశారు బ్రహ్మాజీ. తెలంగాణాలో పార్కింగ్ ఫీజ్ 30 రూపాయలు ఉంది. ఏపీలో బాల్కనీ టికెట్ రేట్ 20 రూపాయలే. సెకండ్ క్లాస్ 15, థర్డ్ క్లాస్ 10 రూపాయలు ఉంది. ఆంథ్రాలో బాల్కనీ రేటు కంటే.. తెలంగాణాలో పార్కింగ్ ఫీజ్ ఎక్కువ. ఈ ట్వీట్ ను ట్యాగ్ చేసిన బ్రహ్మాజీ మీ నాన్నగారి అభిమానిగా అడుగుతున్నా అంటూ రిక్వెస్ట్ చేశారు.
Sirr.. andhariki varalu isthunnaru.. papam theatre owners ki.. cinema vaallaki help cheyyandi.. itlu Mee nanna gari abhimaani 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 https://t.co/wUV2yGzHUG
— Brahmaji (@actorbrahmaji)
బ్రహ్మాజీ ట్వీట్ కు కొంత మంది నెటిజన్లు సపోర్ట్ చేస్తుండగా.. మరికొంతమంది మాత్రం వ్యాతిరేకంగా సెటైర్లు వేస్తున్నారు. బ్రహ్మాజీకి కౌంటర్ గా పోస్ట్ లు పెడుతున్నారు. నటుడు బ్రహ్మాజీ ఇలాంటి విషయాల్లో చాలా యాక్టీవ్ గా ఉంటాడు. తనదైన శైలిలో స్పందిస్తాడు. ఇండస్ట్రీకి సంబంధించిన చాలా విషయల్లో ఈ సినియర్ యాక్టర్ ఇలా చాలా సార్లు ట్వీట్ చేశారు. స్టార్ హీరోల సినిమాల్లో .. ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ.. ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు బ్రహ్మాజీ. బయట చాలా సింపుల్ లైఫ్ ను లీడ్ చేస్తూ.. ఆదర్శంగా ఉంటారు.
Also Read : మళ్లీ కలవబోతున్న RX 100 కాంబినేషన్.. ఈసారి అంతకు మించి ఉంటుందట