
హీరో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరో. ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రాల బడ్జెట్ మొత్తం దాదాపు రెండు వేల కోట్లు ఉంటుంది. అలాంటి ప్రభాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారన్న వార్తలు కలవర పెడుతున్నాయి. షూటింగ్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ సడన్ గా విదేశాలకు వెళ్లారు. మొదట షూటింగ్లో భాగం అనుకున్నారు. తర్వాత హెల్త్ చెకప్ కోసమని తెలిసింది. మళ్ళీ ఆయన షూటింగ్స్ పాల్గొంటారని అందరూ భావించారు.
టాలీవుడ్ వర్గాల ప్రకారం ప్రభాస్ ఆరోగ్య సమస్య కొంచెం పెద్దదేనట. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించారట. ఈ క్రమంలో సెట్స్ మీద ఉన్న ప్రాజెక్ట్స్ మొత్తం తాత్కాలికంగా ఆగిపోనున్నాయంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తోంది. అదే జరిగితే... సలార్, ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్ చిత్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది.
రాజా డీలక్స్ మూవీ షూటింగ్ జస్ట్ మొదలైంది. సలార్ చివరి దశకు చేరుకుంది. ప్రాజెక్ట్ కే కూడా యాభై శాతానికి పైగా కంప్లీట్ చేసినట్లు సమాచారం. సలార్ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా... ప్రాజెక్ట్ కే 2024 జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆదిపురుష్ షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో ఆ చిత్రం మీద ఎలాంటి ప్రభావం ఉండదు. ఇక ప్రభాస్ ఆరోగ్యం మీద వరుస కథనాలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
బాహుబలి 2 అనంతరం ప్రభాస్ లుక్ దారుణంగా తయారైంది. ఆయన ముఖంలో మునుపటి గ్లామర్ పోయింది. సాహో, రాధే శ్యామ్ చిత్రాల్లో ప్రభాస్ లుక్ విమర్శల పాలైంది. ఆయన వాయిస్ సైతం ఛేంజ్ అయ్యింది. వీటన్నింటికీ కారణాలు ఏంటనేది తెలియదు. మరోవైపు ప్రభాస్ పెళ్లి పట్ల ఆసక్తి చూపడం లేదు. బాలయ్య టాక్ షోలో నాకు రాసి పెట్టిలేదంటూ... ఆసక్తికర కామెంట్ చేశాడు.