సిగరెట్ తాగుతూ దొరికిపోయిన విజయ్ దేవరకొండ హీరోయిన్.. ఛీ ఛీ.. పెళ్లి వేడుకలో పాడుపని

Published : Mar 15, 2023, 05:08 PM IST
సిగరెట్ తాగుతూ దొరికిపోయిన విజయ్ దేవరకొండ హీరోయిన్.. ఛీ ఛీ.. పెళ్లి వేడుకలో పాడుపని

సారాంశం

విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంతో అనన్య పాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో అనన్య పాండే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 

విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంతో అనన్య పాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే. అయితే అనన్య మాత్రం నాజూకు అందాలు ఆరబోస్తూ.. విజయ్ దేవరకొండతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది. 

ఇదిలా ఉండగా బిటౌన్ నుంచి వచ్చిన ఈ యంగ్ బ్యూటీ తాజాగా దారుణమైన ట్రోలింగ్ కి గురైంది. అందుకు కారణం ఆమె చేసిన పాడుపనే. అనన్య పాండే ఫ్యామిలిలో పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి. ఆమె కజిన్ అలన్నా వివాహం జరుగుతోంది. మెహందీ వేడుకలో అనన్య పాండే సిగరెట్ తాగుతూ కనిపించింది. ఆ ఫోటోలు లీక్ కావడంతో అనన్యపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. 

ఇంత క్యూట్ గా ఉండే అనన్యకి ఈ పాడు అలవాటు ఉందా అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాలీవుడ్ లో లగ్జరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇలాంటి అలవాట్లు చాలా మంది సెలెబ్రెటీలకు ఉంటాయి. కానీ ఇలా ఫొటోస్ లీక్ అయినప్పుడు ట్రోలింగ్ కి గురవుతుంటారు. గతంలో మౌనిరాయ్, రణబీర్ కపూర్ కలిసి సిగరెట్ తాగుతున్న దృశ్యాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా