Bheemla nayak: అన్నీ తానై నడిపిస్తున్న త్రివిక్రమ్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Published : Nov 26, 2021, 11:53 AM IST
Bheemla nayak: అన్నీ తానై నడిపిస్తున్న త్రివిక్రమ్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సారాంశం

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. అల వైకుంఠపురం లో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన... మహేష్ తో తన నెక్స్ట్ మూవీ ప్రకటించారు. ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ బాధ్యతలు తీసుకున్నారు. 

తన హోమ్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కుతుంది భీమ్లా నాయక్ (Bheemla nayak). మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ కి అధికారిక రీమేక్. మరో హీరోగా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న భీమ్లా నాయక్ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. నిజానికి భీమ్లా నాయక్ చిత్రానికి త్రివిక్రమ్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సినిమా మేకింగ్ లో దర్శకుడు సాగర్ కే చంద్ర పాత్ర నామమాత్రమేనన్న మాట వినిపిస్తుంది. 


ఒరిజినల్ కథకు పవన్ (Pawan kalyan)ఇమేజ్ కోసం అనేక మార్పులు చేశారు. మలయాళ క్లాసిక్ హిట్ ని కమర్షియల్ సినిమాగా మార్చేస్తున్నారు. పవన్, రానా మధ్య సాగే ఆధిపత్య పోరే.. భీమ్లా నాయక్ స్టోరీ. కాగా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ కావలసిందే. భీమ్లా నాయక్ నిర్మాతలు ఏకంగా రూ. 15 కోట్ల రూపాయలు త్రివిక్రమ్ కి ఇస్తున్నారట. దానితో పాటు లాభాలలో కొంత పర్సెంటేజ్ కూడా ఆయనకు ఉందట. ఓ పూర్తి స్థాయి చిత్రానికి దర్శకత్వం చేస్తే వచ్చే రెమ్యూనరేషన్ కంటే అధికంగా త్రివిక్రమ్ భీమ్లా నాయక్ చిత్రానికి తీసుకుంటున్నారట. 

Also read ఏపీ టికెట్ ధరల ఎఫెక్ట్: దిక్కుతోచని స్థితిలో టాలీవుడ్.. అఖండ నుంచి పెద్ద చిత్రాలే, నిర్మాతల ప్లాన్ ?
రాజమౌళి మినహాయిస్తే టాలీవుడ్ లో ఓ ఒక్క డైరెక్టర్ కూడా రూ. 15 కోట్లకు మించి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. అలాంటిది భీమ్లా నాయక్ ద్వారా త్రివిక్రమ్ (Trivikram) అంతకు మించి ఆర్జిస్తున్న ట్లు సమాచారం. ఇక భీమ్లా నాయక్ లో మనం త్రివిక్రమ్ మార్క్ మేకింగ్ చూడవచ్చు. జనవరి 12న భీమ్లా నాయక్ విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించగా... ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు విడుదల వాయిదా వేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. 

Also read NTR vs Lokesh: చంద్రబాబుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ... రెండుగా చీలిన టీడీపీ
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today డిసెంబర్ 06 ఎపిసోడ్ : రామరాజు గ్రీన్ సిగ్నల్.. వల్లికి ఉద్యోగం తిప్పలు, ఇరికించిన నర్మద, ప్రేమ
Superstar Krishna హీరోగా పూరీ జగన్నాథ్‌ ఫస్ట్ మూవీ ఎలా ఆగిపోయిందో తెలుసా? రెండు సార్లు చేదు అనుభవం