ఇండియాలో ఫస్ట్ టైమ్ ఇలాంటి ఫీట్ .. తెరపై ఏ రేంజిలో పేలుతుందో

By Surya Prakash  |  First Published Nov 26, 2021, 6:48 AM IST

350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఆయన బ్యానర్ నుంచి వస్తున్న 50వ సినిమా ఇది. అందువలన ఈ ప్రాజెక్టు తన బ్యానర్ స్థాయిని పెంచేలా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. 


 మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ జంటగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి రోజుకో విశేషం బయిటకు వచ్చి ఫ్యాన్స్ కు పండగ చేస్తోంది. తాజాగా ఈ మూవీ గురించిన ఓ అప్డేట్ బాలీవుడ్ మీడియా నుంచి వచ్చింది. ఇది ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది. అదేమిటంటే..

ఈ నెల 15వ తేదీ నుంచి ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్లో చరణ్ - కియారా కాంబినేషన్లో కొన్ని రొమాంటిక్ సీన్స్ తో పాటు ఒక పాటను కూడా ప్లాన్ చేశారు. చరణ్ - కియారాతో పాటు అమెరికా .. రష్యా .. ఉక్రెయిన్ .. బ్రెజిల్ .. ఆఫ్రికా .. యూరప్ తదితర దేశాలకు చెందిన 80 మంది డాన్సర్లు ఈ పాటలో పాల్గొననున్నారు. 10 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించనున్నారట. తమన్ స్వరపరిచిన ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందిస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారని ఈ సెట్ కోసం 40 కోట్లను ఖర్చు పెడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. పది  రోజుల పాటు ఆ అదిరిపోయే లొకేషన్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సాంగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో డ్యాన్సర్లు ఇప్పటికే బస చేస్తున్నారు. ఇప్పటి వరకు మరే  ఇండియన్ సినిమాకు కూడా ఈ రేంజ్ లో ఫారిన్ డ్యాన్సర్ లను వాడలేదని అంటున్నారు. ఖచ్చితంగా తెరపై ఓ కొత్త లోకం ఆవిష్కారమవుతుందని చెప్తున్నారు. సినిమా హైలెట్స్ లో ఇదొకటి అని వినిపిస్తోంది. గతంలో  'జీన్స్' సినిమాలోని ఒక పాట కోసం ఆయన ప్రపంచ వింతలను కవర్ చేశాడు. సినిమాలో ఆ పాట హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు అలాంటిదే జరగబోతోంది.
 
మరో ప్రక్క ఈ సినిమా చరణ్ లుక్ ఇదేనంటూ లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.  శంకర్ సినిమాకోసం సరికొత్త మేకోవర్‌తో తయారయ్యాడు చరణ్. అయితే, ఇప్పటివరకు దానికి సంబంధించిన లుక్ రివీల్ కాలేదు. తాజాగా, చరణ్ - శంకర్ మూవీ షుటింగ్ లొకేషన్ నుంచి ఓ సరికొత్త లుక్‌లో ఉన్న చరణ్ పిక్ బయటకి వచ్చింది. ఈ లుక్ గతంలో చరణ్ నటించిన 'ఆరెంజ్' మూవీలోని లుక్ తరహాలో చాలా స్టైలిష్‌గా ఉంది. ప్రస్తుతం ఈ లుక్‌లో చరణ్ బాగా ఆకట్టుకుంటున్నాడు. 
 

Latest Videos

click me!