రకరకాల కారణాలతో ఈ సినిమా ప్రారంభం నుంచి లేటు అవుతూనే వస్తోంది. అప్పటికి కొన్ని సీన్స్ షూట్ చేసిన బోయపాటి,బాలయ్య ..రషష్ చూసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా అఘోరా పాత్ర విషయంలో ఓ డెసిషన్ కు వచ్చారని మీడియా సర్కిల్స్ లో వినపడుతోంది. అఘోరా పాత్రలో బాలయ్య నప్పలేదని, సినిమా రిలీజ్ అయ్యాక ట్రోలింగ్ కు గురి అవుతుందని ..ఆ పాత్ర తీసేద్దామని డెసిషన్ కు వచ్చినట్లు సమాచారం.
నందమూరి బాలకృష్ణ తన 106వ సినిమాని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష-బోయపాటిలది సక్సస్ ఫుల్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రకరకాల కారణాలతో ఈ సినిమా ప్రారంభం నుంచి లేటు అవుతూనే వస్తోంది. అప్పటికి కొన్ని సీన్స్ షూట్ చేసిన బోయపాటి,బాలయ్య ..రషష్ చూసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా అఘోరా పాత్ర విషయంలో ఓ డెసిషన్ కు వచ్చారని మీడియా సర్కిల్స్ లో వినపడుతోంది. అఘోరా పాత్రలో బాలయ్య నప్పలేదని, సినిమా రిలీజ్ అయ్యాక ట్రోలింగ్ కు గురి అవుతుందని ..ఆ పాత్ర తీసేద్దామని డెసిషన్ కు వచ్చినట్లు సమాచారం.
అందుకుతగ్గట్లు ఈ స్క్రిప్ట్‌లో అనేక మార్పులు చేశారట. ఈ క్రమంలో బాలయ్య అఘోరా తరహా పాత్రను తీసేస్తే మరి ఆ సీన్స్ బదులుగా వేరేవి ఏవి నప్పుతాయో చూసి సెట్ చేసారట. అంతేకాదు ఇందులో ఒక హీరోయిన్‌నే పెట్టనున్నారని, అలాగే పాటలను కూడా కట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
అలాగే ఈ సినిమా కోసం ముందు మలయాళ బ్యూటీ ప్రయాగ మార్టిన్‌ని ఫైనల్ చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోగా.. ఆ తరువాత సాయేషా సైగల్ లైన్‌లోకి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం సాయేషా కూడా వద్దనుకోగా.. ఆ స్థానంలో కంచె బ్యూటీ ప్రగ్యా జైశ్యాల్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఇలా అనేక మార్పులు జరిగినట్లు ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అంతేకాకుండా మొదట నుంచీ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రను సీనియర్ హీరోలలో ఎవరైనా చేస్తే బాగుంటుందని భావించిన బోయపాటి, చివరికి తొట్టెంపూడి వేణును ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా ఎన్టీఆర్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన 'దమ్ము' సినిమాలోను వేణు ఒక ముఖ్యమైన పాత్రను చేశాడు. మళ్లీ ఇంతకాలానికి ఆయనకి బోయపాటి అవకాశం ఇవ్వటం జరుగుతోంది.
ఇక ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య కవలలుగా రెండు పాత్రల్లో నటిస్తున్నారని, చిన్నతనంలోనే వారిద్దరు వేరు అయి ఒకరు వారణాసిలో, మరొకరు అనంతరపురంలో పెరుగుతారని ఇటీవల ప్రచారం జరిగింది.
అయితే గతంలో బోయపాటి మాట్లాడుతూ.. అఘోరా టైపు క్యారెక్టర్ ఒకటి ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఎలా డిజైన్ చేశాం, ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. "సింహా", "లెజెండ్" నుంచి కొంచెం బయటకొచ్చి కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు నాకు ఆ పాత్ర తట్టింది. కాకపోతే సెటప్ అంతా కొత్తగా ఉంటుంది. కొత్తదనం కావాలంటే ఈమాత్రం ట్రై చేయాల్సిందే అని చెప్పారు.