తరుణ్ భాస్కర్‌ నెక్ట్స్ వెంకీతో కాదట,మరో స్టార్ తో ..

Surya Prakash   | Asianet News
Published : Nov 23, 2020, 04:49 PM IST
తరుణ్ భాస్కర్‌ నెక్ట్స్ వెంకీతో కాదట,మరో స్టార్ తో ..

సారాంశం

ఈ నేపధ్యంలో ఆయన వెంకటేష్ తో సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ సురేష్ బాబు సైతం ప్రకటన చేసారు. అయితే ఇప్పటిదాకా ఆ సినిమా కార్య రూపం దాల్చలేదు. వెంకటేష్ మాత్రం వరస ప్రాజెక్టులు సైన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో తరుణ్ భాస్కర్ మరో హీరోతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన అఫీషియల్ గా ప్రకటన లాంటిది ఇనిస్ట్రాలో చేసారు.

తొలి సినిమా పెళ్లిచూపులుతో  హాట్ టాపిక్‌గా మారారు దర్శకుడు తరుణ్ భాస్కర్‌. ఈ సినిమాకి తరుణ్‌కి జాతీయ అవార్డు రావడంతో పాటు కమర్షియల్ గానూ సూపర్ హిట్ అయ్యింది. స్టార్ హీరోలు అతనితో పనిచేయటానికి క్యూ కడితే అతను మాత్రం కూల్ గా  ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అంతా కొత్త వారితో తీశారు. అయితే ఈ మూవీ ఆడలేదు. కానీ తరుణ్‌ క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఆయన కొత్త సినిమా కోసం అభిమానులు ఓ రేంజిలో ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపధ్యంలో ఆయన వెంకటేష్ తో సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ సురేష్ బాబు సైతం ప్రకటన చేసారు. అయితే ఇప్పటిదాకా ఆ సినిమా కార్య రూపం దాల్చలేదు. వెంకటేష్ మాత్రం వరస ప్రాజెక్టులు సైన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో తరుణ్ భాస్కర్ మరో హీరోతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన అఫీషియల్ గా ప్రకటన లాంటిది ఇనిస్ట్రాలో చేసారు.

 ‘‘నా 3వ సినిమా నన్ను చాలా ఇబ్బందుల్లో పెట్టింది. రెండు పెద్ద ప్రాజెక్ట్‌లు చేసే అవకాశం వచ్చింది.. వీటిలో ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టమైంది. బాగా ఆలోచించిన తర్వాత క్రైమ్‌ డ్రామాతో సినిమా తెరకెక్కిద్దాం అని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలో ఓ ప్రముఖ స్టార్‌ హీరో నటించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుల్ని అస్సలు నిరుత్సాహపరచదు’’ అన్నారు. 

అయితే ఆ ప్రముఖ స్టార్ హీరో వెంకటేష్ అని కొందరంటూంటే మరికొందరు కాదు వేరే పెద్ద స్టార్, వెంకటేష్ అయితే ఆయనే స్వయంగా చెప్పేవారుగా..ఆల్రెడీ ప్రకటన వచ్చింది దాంట్లో దాచేదేముంది అంటున్నారు. ఏదమైనా మరోసారి సస్పెన్స్ లో పెట్టేసారు తరుణ్ భాస్కర్. తనదైన శైలి క్రైమ్ డ్రామాతో మన ముందుకు రాబోతున్నారని చెప్పారు కాబట్టి మరికొంతకాలం మిగతా డిటేల్స్ కోసం ఎదురుచూపులు తప్పవు.
  
PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?