
తెలుగులో ఇప్పుడు లీడింగ్ సంస్థగా దూసుకుపోతున్న సంస్ద ఏదీ అంటే ‘మైత్రీ మూవీ మేకర్స్’ అనే చెప్పాలి . తొలి చిత్రం ‘శ్రీమంతుడు’ తోనే నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న ఈ సంస్థ.. ఆ వెంటనే ‘జనతా గ్యారేజ్’ ‘రంగస్థలం’ వంటి చిత్రాలతో కూడా అదే జోరుని కొనసాగించింది. కేవలం పెద్ద సినిమాలను మాత్రమే కాకుండా మీడియం రేంజి సినిమాలను సైతం చేస్తూ ముందుకు వెళ్తోంది. ‘ఉప్పెన’వంటి సినిమాతో భారీ వసూళ్లను అందుకుంటుంది ఈ సంస్థ. పుష్ప తో ఈ సంస్ద ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆ సంస్దలో పనిచేయాలని హీరోలంతా ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా రామ్ పోతినేని సైతం ఈ సంస్దలో సైన్ చేసినట్లు సమాచారం. మరి దర్శకుడు ఎవరు...
మైత్రీ మేకర్స్ వారు హీరో రామ్ కు భారీ ఎమౌంట్ ని అడ్వాన్స్ గా ఇచ్చి లాక్ చేసినట్లు తెలుస్తోంది. దర్శకులుగా హరీష్ శంకర్, శ్రీను వైట్ల ఇద్దరిలో ఒకరు కావచ్చు అంటున్నారు. ఈ మేరకు డిస్కషన్స్ జరుగుతున్నట్లు వినికిడి. శ్రీను వైట్ల ఇప్పటికే ఓ హిలేరియస్ ఎంటర్టైనర్ ని వినిపించినట్లు సమాచారం. అయితే అదే సమయంలో దర్శకుడు హరీష్ శంకర్‌తో కూడా ఓ సినిమా చేసేందుకు రామ్ చర్చలు జరుపుతున్నాడట. ఇందుకోసమే కొద్దిరోజుల క్రితం రామ్.. హరీష్ శంకర్‌ని కలిసి స్క్రిప్ట్ కూడా విన్నాడట. అతి త్వరలోనే ఈ కాంబో పై ఓ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది.
ఇక ప్రస్తుతం రామ్ పోతినేని పూరి జగన్ దర్శకత్వంలో 'డబుల్ ఇస్మార్ట్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో రామ్ బిజీగా ఉన్నాడు. మొన్నటివరకూ ఈ చిత్రం షూటింగ్ ఆర్థిక సమస్యల కారణంగా చాలా కాలం పాటు ఆగిపోగా కొన్ని రోజుల క్రితమే ముంబైలో మళ్లీ మొదలైంది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
2019లో పూరి జగన్నాథ్‌తో చేసిన 'ఇస్మార్ట్ శంకర్' బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇప్పటివరకూ రామ్‌కి మరో హిట్ దక్కలేదు. ఆ తర్వాత చేసిన రెడ్, ది వారియర్, స్కంద చిత్రాలు ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయాయి. ముఖ్యంగా డైరెక్టర్ బోయపాటి శీనుతో చేసిన స్కంద సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు రామ్. ఆ సినిమాను తేడా కొట్టింది. దాంతో కేవలం ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ని ఆయన పూర్తిగా నమ్ముకుని ఎదురుచూస్తున్నారు.