నటి ఆత్మహత్యాయత్నం..విషమంగా ఆరోగ్యం

Published : Sep 21, 2018, 10:39 AM IST
నటి ఆత్మహత్యాయత్నం..విషమంగా ఆరోగ్యం

సారాంశం

కేకే.నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి నీలాణిని విచారించడానికి సిద్ధం కాగా ఆమె పరారైంది.

బుల్లితెర నటి నీలాణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నటి నీలాణి ప్రేమించి, సహజీవనం చేసిన సహాయ దర్శకుడు గాంధీలలిత్‌కుమార్‌తో గొడవ పడి వార్తల్లోకి ఎక్కెంది. అతను పెళ్లి చేసుకోమని వేధింపులకు గురిచేస్తున్నాడని మైలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాంధీలలిత్‌కుమార్‌ మనస్తాపానికి గురై ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేకే.నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి నీలాణిని విచారించడానికి సిద్ధం కాగా ఆమె పరారైంది.

ఆ తరువాత చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి గాంధీలలిత్‌కుమార్‌ ఆత్మహత్యకు తాను కారణం కాదని, అతను తనను నుంచి డబ్బు తీసుకుని మోసం చేశారని ఫిర్యాదు చేసింది. అయితే తన తమ్ముడి చావుకు నీలాణినే కారణం అని గాంధీలలిత్‌కుమార్‌ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.  నటి నీలాణి గురువారం స్థానిక ఆలపాక్కంలోని  ఇంట్లో దోమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె కేకే.నగర్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

read more news

ఆయనతో సంబంధం ఉన్న మాట నిజమే.. నటి కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?