థమన్ పై ఆగని సెటైర్లు!

Published : Sep 20, 2018, 05:50 PM IST
థమన్ పై ఆగని సెటైర్లు!

సారాంశం

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ ఒకరు.. దేవిశ్రీప్రసాద్ తరువాత నిర్మాతలకు మరొక ఆప్షన్ థమన్ అనే చెప్పాలి. మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా థమన్ నే తీసుకుంటూ ఉంటారు. అయితే అతడు ట్యూన్లను కాపీ చేస్తుంటాడనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. 

వీటిపై థమన్ కూడా అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా.. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'అరవింద సమేత'కి కూడా ఆయన్నే సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. అభిరుచి గల దర్శకుడు కావడంతో థమన్ నుండి కొత్త పాటలను ఆశించారు ప్రేక్షకులు. కానీ ఈసారి కూడా సోషల్ మీడియాలో థమన్ ని టార్గెట్ చేశారు.

'అరవింద సమేత' నుండి విడుదలైన 'అనగనగనగా','పెనివిటి' అనే పాటలను వింటుంటే ఎక్కడో విన్న ఫీలింగ్ వస్తుందనే కామెంట్లు మెల్లగా ఊపందుకున్నాయి. 'అనగనగనగా' పాటను 'ఓ మై ఫ్రెండ్' సినిమాలో ఓ పాటతో పోలుస్తున్నారు. ఈ సినిమాకు మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ పని చేశారు.

అలానే 'పెనివిటి' పాటను 'పండగ చేస్కో' సినిమాలో పాటతో పోల్చడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈసారి కూడా థమన్ తన సొంత ట్యూన్ ని కాపీ చేశాడంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా ఈ రెండు పాటలు మాత్రం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌