అఖిల్ పై ఘాటు విమర్శలు!

Published : Sep 20, 2018, 06:26 PM IST
అఖిల్ పై ఘాటు విమర్శలు!

సారాంశం

అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈరోజు అక్కినేని నాగేశ్వరావు జయంతి సందర్భంగా చిత్రబృందం సినిమా టైటిల్ ని రివీల్ చేస్తూ.. టీజర్ ని వదిలింది. 

సినిమాకి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ని ఫిక్స్ క్సహేసింది. అయితే ఈ టీజర్ విడుదలైన కొద్దీ గంటల్లోనే అఖిల్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.త్యాగాలతో కూడుకున్న మజ్ను ప్రేమకథని అలాంటి టైటిల్ ని దిగజారుస్తూ ఓ ప్లే క్యారెక్టర్ పోషిస్తోన్న అఖిల్ సినిమాకు 'మిస్టర్ మజ్ను' అని పెట్టడమేంటని విమర్శలు చేస్తున్నారు.

కొన్ని క్లాసిక్ టైటిల్స్ ని ముట్టుకోకపోవడమే మంచిదని, ఒకవేళ వాడుకుంటే జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు. ఒకప్పుడు ఏఎన్నార్, ఆ తరువాత నాగార్జునలు ఈ టైటిల్స్ తో సినిమాల్లో నటించిన భగ్న ప్రేమికులుగా చక్కటి నటన కనబరిచారు.

అలాంటి టైటిల్ ని అఖిల్ దుర్వినియోగం చేస్తున్నాడంటూ టీజర్ చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అఖిల్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి!

PREV
click me!

Recommended Stories

జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది