Bigg Boss Telugu 7: శోభాకి లక్కీ ఛాన్స్.. సీరియల్ బ్యాచ్‌లో గొడవలు.. ఆ ఇద్దరు కలిసి అమర్‌ దీప్‌ని టార్గెట్‌..

Published : Dec 05, 2023, 11:20 PM IST
Bigg Boss Telugu 7: శోభాకి లక్కీ ఛాన్స్.. సీరియల్ బ్యాచ్‌లో గొడవలు.. ఆ ఇద్దరు కలిసి అమర్‌ దీప్‌ని టార్గెట్‌..

సారాంశం

బిగ్‌ బాస్‌ తెలుగు 7లో ఇన్నాళ్లు సీరియల్ బ్యాచ్‌ యూనిటీగా ఉన్నారు. అయితే నెమ్మదిగా గొడవలు ప్రారంభవుతున్నాయి. ఇద్దరు లేడీస్‌ కలిసి అమర్‌ దీప్‌ని టార్గెట్ చేశారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ ముగింపుకి చేరుకుంది. ప్రస్తుతం 14వ వారం (93వ రోజు)కి చేరుకుంది. మరో వారంలో బిగ్‌ బాస్‌ షో క్లోజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగే ఆట ఆసక్తికరంగా మారబోతుంది. నిన్న నామినేషన్లు రసవత్తరంగా సాగింది. దాని తాలుకూ ఎఫెక్ట్ మంగళవారం ఎపిసోడ్‌లో కనిపించింది. అమర్‌, ప్రశాంత్‌ మధ్య గొడవ కంటిన్యూ అయ్యింది. ఇక మంగళవారం ఎపిసోడ్‌లో ఫన్నీ టాస్క్ లు మరింత ఆసక్తికరంగా సాగాయి. డైరెక్టర్‌ ఆడియెన్స్ తో తమకి ఓటు వేయండి అని రిక్వెస్ట్ చేసుకునేందుకు ఫన్నీ టాస్క్ లు నిర్వహించారు బిగ్‌ బాస్‌. 

ఇందులో మొదట పార్టీ చేసుకునేందుకు సంబంధించిన వస్తువులను తీసుకుని ముందుగా స్విమ్మింగ్‌ పూల్‌లో దూకాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో యావర్ విన్నర్‌ అయ్యారు. చివరి నిమిషంలో శివాజీ ఓడిపోయారు. ఆ తర్వాత జంపింగ్‌ టాస్క్ లో శోభా శెట్టి విన్నర్‌ అయ్యింది. ఇందులోనూ చివర్లో శివాజీ ఓడిపోయాడు. ఇలా ఈ రెండు టాస్క్ ల్లో యావర్‌, శోభ విన్నర్‌గా నిలిచి తమకు ఓటు వేయాలనే అవకాశాన్ని దక్కించుకున్నారు. అయితే ఇందులోనూ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ఆ అవకాశం ఉందన్నారు. ఆ ఒక్కరు ఎవరో ఇతర ఇంటి సభ్యులు నిర్ణయించాల్సి ఉందన్నారు. 

శోభాకి.. అమర్‌ దీప్‌, ప్రియాంక, అర్జున్‌ వేశారు. యావర్‌కి ప్రశాంత్‌, శివాజీ వేశారు. ఇందులో శోభా విన్నర్‌ అయ్యింది. ఆమెకి డైరెక్ట్‌ గా ఆడియెన్స్ కి రిక్వెస్ట్‌ చేసుకునే అవకాశాన్ని అందుకుంది. తను ఎంతో అవమానాలు ఎదుర్కొని ఈ స్థానానికి చేరుకున్నానని, అమ్మ సపోర్ట్ తో ఇక్కడి వరకు వచ్చానని, తాను తొలి లేడీ టైటిల్‌ విన్నర్‌గా నిలవాలనుకుంటున్నట్టు చెప్పింది. టైటిల్‌ విన్నర్ ద్వారా వచ్చే అమౌంట్‌ తనకు చాలా ముఖ్యమని, తన లైఫ్‌కి ఎంతో అవసరం ఉందని చెప్పింది శోభా. 

ఇదిలా ఉంటే మధ్యలో సీరియల్‌ బ్యాచ్‌కి మధ్య గొడవలు జరిగాయి. ప్రియాంక, అమర్‌ దీప్‌, శోభా శెట్టి సరదాగా ఆడుకునే సమయంలో బొమ్మతో ప్రియాంక గట్టిగా కొట్టింది. అది అమర్‌ ముక్కుకి తగిలింది. దీంతో అమర్ దీప్‌ ఆ బొమ్మని విసిరేసి కోపంతో రియాక్ట్ అవుతూ వెళ్లిపోవడంతో ప్రియాంక, శోభా శెట్టి హర్ట్ అయ్యారు. దీంతో ఆయనపై అలిగారు. దీనికోసం ముగ్గురు గొడవ పడ్డారు. అంతకు ముందు ప్రశాంత్‌ విషయంలో ప్రియాంక, శోభా శెట్టి, అమర్‌ దీప్‌ లు చర్చించుకుంటూ, శివాజీ,ప్రశాంత్‌ ప్రవర్తనలు చెబుతూ కలిసి ముచ్చటించుకున్నారు. మరోవైపు శోభాకి ఓటు వేసే విషయంలోనూ తమ యూనిటినీ చాటుకున్నారు. మళ్లీ చివర్లో మరోసారి ఈ ముగ్గరు గొడవ పడటం ఆశ్చర్యంగా మారింది. నెమ్మదిగా సీరియల్‌ బ్యాచ్‌లో గొడవలు షురూ కావడం గమనార్హం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే
Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?