తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా ఎంపికైన రేవంత్‌రెడ్డికి నందమూరి బాలకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన నోట్‌ని పంచుకున్నారు.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి ఎంపిక చేసినట్టు ఇన్ ఛార్జ్ కేసీ వేణుగోపాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రెండు రోజులుగా తెలంగాణ సీఎం ఎవరు అనే ప్రతిష్టంభనకి తెరపడినట్టయ్యింది. ఊహించినట్టే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపియ్యారు. ఎల్లుండి(డిసెంబర్ 7) రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. భారీ స్థాయిలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండబోతుంది.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి అభినందనల వెల్లువ కొనసాగుతుంది. తాజాగా హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన అభినందనలు తెలిపారు. `తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. ప్రజా సేవ పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగారు. తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారి ఆకాంక్షను నేరవేర్చాలని, అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధిపదంగా ముందుకు పోవాలని ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రి మీ పాలన మార్క్ తో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను` అని వెల్లడించారు బాలకృష్ణ.
రేవంత్ రెడ్డికి, బాలకృష్ణకి మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో వీరిద్దరు తరచూ కలుసుకునేవారు. చంద్రబాబుకి క్లోజ్‌గా రేవంత్‌రెడ్డి మూవ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనూ ఆ అనుబంధం బాలయ్యతోనూ ఉందని చెప్పొచ్చు. సీఎంగా రేవంత్ ఎంపికైన వెంటనే ఆయన తన అభినందనలు చెప్పడం విశేషం. బాలకృష్ణ హీరోగా బిజీగా ఉన్నారు. మరోవైపు హిందూపురం(ఏపీ) ఎమ్మెల్యేగా బాలయ్య ఉన్న విషయం తెలిసిందే.